ఊట్కూర్, మార్చి 08: మహబూబ్నగర్ జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. మండల కేంద్ర గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. మహిళా కార్మికులను గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులను కల్పించిందన్నారు. మహిళలు పురుషులతో పోటీపడి అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయం అని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వెంకటేశ్వరమ్మ, పార్వతి, పుష్ప, సునీత, గ్రామ పంచాయతీ కారోబార్ పోలప్ప, సిబ్బంది కనకప్ప, బాలకృష్ణ, ఉదయ్ కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.