మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10 : గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపామని, అడ్డాగా ఉన్న ధూల్‌పేటలో నెలరోజులుగా విస్తృతంగా దాడులు నిర్వహిం చి పూర్తిగా అరికట్టామని.., ఇక పాలమూరుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీవీ కమలాసన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మ హబూబ్‌నగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జాయింట్ కమిషనర్ ఖురేషీతో కలిసి మాట్లాడారు.
ధూల్‌పేట్‌లో నెల రోజులుగా దా డులు నిర్వహిస్తూ గంజాయి విక్రయదారులను చాలా మందిని జైలుకు పంపించామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నాటుసారా, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు ఆయా జిల్లాల పోలీసు అధికారుల సమన్వయంతో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ముందుకు సాగుతున్నారన్నారు. ఇందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
ఇతర జిల్లాలతో పోలిస్తే డ్రగ్స్ వినియోగం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తక్కువగా ఉన్నా.. నాటుసారా, కల్తీ కల్లు తాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్న కుటుంబాలు ఈ జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్నాయని అన్నా రు. వాటిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఎక్సైజ్ యం త్రాంగం అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పా రు. ముఖ్యంగా ఇతర రాష్ర్టాల నుంచి మద్యం రాకుం డా అడ్డుకోవడానికి కృష్ణ, నందిన్నె చెక్‌పోస్టుల్లో నిఘా పెంచామని వివరించారు.
ఎక్సైజ్‌శాఖకు మంచిపేరు తేవాలి..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాటుసారా, కల్తీకల్లును పూర్తిగా అరికట్టి ఎక్సైజ్ శాఖకు మంచిపేరు తేవాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి సూచించారు. మంగళవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడారు. డ్రగ్స్, మత్తు పదార్థాల రవాణాపై పూర్తి స్థాయిలో నిఘా పెంచాలని సూచించారు. సారా, కల్లీకల్లు తయారీకి వినియోగిస్తున్న బెల్లం, ఆలం, ఆ ల్ఫాజోలం వంటి వాటిపై దృష్టి సారించి పూర్తిస్థాయిలో కట్టడి చేయాలన్నారు. నియమ నిబంధనలకు విరుద్ధం గా జరిగే ప్రతిదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ ఖు రేషీ, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, అసిస్టెం ట్ కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఈఎ స్ గాయత్రి, అధికారులు పాల్గొన్నారు.