మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 30: జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో 69వ రాష్ట్రస్థాయి రగ్బీ టోర్నీ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. టోర్నీకి ఉమ్మడి పది జిల్లాల నుంచి అండర్-14 విభాగంలోని బాల, బా లికలు 200 మంది పాల్గొన్నారు. శనివారం నుంచి సోమవారం వరకు లీగ్‌కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలను నిర్వహించనున్నారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఎంఈవో లక్ష్మణ్‌సింగ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్-14 రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలను ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదబాయి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నిరంజన్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్ తిలకించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి తర్వాత గెలుపు సాధ్యమేనన్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదాబాయి, ఆర్గనైజంగ్ కార్యదర్శి నిరంజన్‌రావు మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభ చాటేవారికి స్పోర్ట్స్ కో టాలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో పేట జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, ఒలింపిక్ జిల్లా ప్రధా న కార్యదర్శి కురుమూర్తిగౌడ్, నిర్వాహకులు వేణుగోపా ల్, బాలరాజు, వడెన్న, స్వప్న, కిష్టన్న పాల్గొన్నారు.