వీపనగండ్ల మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 75మంది విద్యార్థులు చేరారు. వీరికి అదనంగా ద్వితీయ సంవత్సర విద్యార్థులు మరో 70మంది వరకు ఉన్నారు. ఇలా అన్ని గ్రూపులకు కలిపి 145 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే, జూలై ఒకటిన కళాశాలలు తెరుచుకున్నాయి. ఈ లెక్కన మూడు నెలలవుతున్నా.. లెక్చరర్లు లేక ఇంగ్లిష్ పుస్తకం తెరుచుకోలేదు.
వనపర్తి జిల్లాలో 12 జూనియర్ కళాశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో ఈ ఏ డాది మొదటి సంవత్సరంలో దాదాపు 1,753 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. వీ రికి అదనంగా ద్వితీయ సంవత్సరానికి చెందిన మరో 1,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకులాల ఏర్పాటుతో వీటికి ప్రాధాన్యం తగ్గిందన్న భావన ఉన్నది. అయితే, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను రెగ్యులర్ చే సి కొంత ఊరటనిచ్చారు. అయినప్పటికీ కళాశాలల్లో ఇంకా కొన్ని సబ్జెక్టులకు అ ధ్యాపకులను నియమించలేదు. ఇందుకు గెస్ట్ లెక్చరర్ పేరుతో అధ్యాపకులు లేని సబ్జెక్టులకు ప్రభుత్వ అనుమతుల ద్వారా అ భ్యర్థులను తీసుకొని బోధన చేస్తూ వస్తున్నారు. ఇది ఈ ఏడాది ఇంకా అమలుకు నోచుకోకపోవడంతో విద్యార్థులు తీ వ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది.
గోపాల్పేట ఇంటర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 68 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. సెకండియర్‌లో 65 మంది ఉన్నా రు. ఇలా నాలుగు గ్రూపుల్లో కలిపి 132మంది ఉన్నారు. అయితే, ఇక్కడ కూడా తెలుగు, ఇంగ్లిష్ అధ్యాపకులు కరువయ్యారు.
వనపర్తి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఇరకాటంలో పడ్డారు. కళాశాలలు తెరుచుకొని మూడు నెలలైనా.. వివిధ సబ్జెక్టులకు అధ్యాపకులు లేక విద్యార్థులు బోధనకు నోచుకోవడంలేదు. కొన్ని కళాశాలల్లో ఇంగ్లిష్ పుస్తకమే తెరుచుకోలేదు. సర్కార్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న నిరుపేద విద్యార్థులకు దిక్కూమొక్కు లేకుండాపోయింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించి 64పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో గతేడాదిలోనూ గెస్ట్ లెక్చరర్స్ పనిచేశారు. ప్రస్తుత వి ద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈపాటికే ఖాళీలను భర్తీ చేసి బోధనలు ప్రా రంభించాల్సి ఉంది. కాలేజీలు తెరచుకుని మూడు నెల లు గడిచినా ఇప్పటి వరకు ఉలుకూపలుకు లేదు. దీం తో నిరుపేద విద్యార్థులంతా లెక్చరర్స్ లేని సబ్జెక్టుల్లో వెనుకబాటుకు గురవుతున్నారు. ఒక్కో కళాశాలలో ఒ క్కో సబ్జెక్టు వారీగా ఖాళీలున్నాయి. వీటిలో కొన్ని కళాశాలల్లో ఇంగ్లిష్‌కు కూడా లెక్చరర్స్ లేకపోవడంతో ఇప్పటివరకు పుస్తకమే తెరువలేదు. మరికొన్ని చోట్ల తెలుగు, కెమెస్ట్రీ, మాథ్స్ వంటివి కూడా బోధించడంలేదంటే విద్యార్థులు ఎలా ఉత్తీర్ణత సాధిస్తారన్నది ప్ర శ్నార్థకంగా మిగులుతుంది.
జిల్లాలోని 12 కళాశాలలకుగా నూ అయిదు కళాశాలలకు ఇన్చార్జి ప్రిన్సిపాళ్లు కొనసాగుతున్నారు. వీరిలో ఒక్కొక్కరికి రెండు కళాశాలలను అప్పగించడంతో పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇన్‌చార్జీలుగా బాధ్యతలు తీసుకున్నారే తప్పా కళాశాలలకు వెళ్లడం లేదు. ఇప్పటివరకు ఒకటి, రెండు దఫాలు మాత్రమే కాలేజీలకు వెళ్లినట్లు సమాచారం. అదికూడా డీఐవో వచ్చినప్పుడో.. కళాశాల ఫేర్వల్ ప్రోగ్రాం పెట్టినప్పుడో తప్పా కళాశాల పర్యవేక్షణకు మాత్రం రావడం లేదన్న వాదనలున్నా యి. ఇప్పుడున్న ప్రిన్సిపాళ్లలో కొందరు హైదరాబాద్ నుంచి రోజువారీ రాకపోకలు సాగిస్తున్నారు. ఇక వీరి ప్రయాణానికి సమయం సరిపోదని, ఇక కళశాలలకు ఎలా న్యాయం చేస్తారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆత్మకూరు, పెద్దమందడి, వీపనగండ్ల, శ్రీరంగాపురం, పాన్‌గల్ కాలేజీలకు ఇన్చార్జి ప్రిన్సిపాళ్లే ఉన్నారు.