మహబూబ్‌నగర్, ఆగస్టు 10 : ఏండ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తూ జీవనం సాగిస్తున్న గ్రామ రెవెన్యూ సహయకులకు తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయేలా సముచిత స్థానం కల్పించిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో 508మంది వీఆర్ఏలకు 16శాఖల్లో జూనియర్ అసిస్టెంట్‌తోపాటు వివిధ కేటగిరీల్లో విద్యార్హతలను పరిగణలోకి తీసుకొని నియామకపత్రాలు, 34మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ ఆర్డర్స్‌ను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ రవినాయక్‌తో కలి సి మంత్రి అందజేశారు. ఈ సందర్భం గా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ గ్రామ సేవకులుగా పనిచేస్తున్న వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన ఘ నత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఎప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా తక్షణమే పరిష్కరించేందుకు అం దుబాటులో ఉంటామన్నారు. ఏండ్ల తరబడి గ్రామాల్లో వంతుల వారి విధా నంతో కుటుంబలోని అందరూ ఒకరి తరువాత ఒకరు గ్రామ సహాయకులుగా పనిచేసే వారని, వీఆర్ఏలకు గ్రామాల్లో చాలా పనులను చేయించే వారని గుర్తు చేశా రు. ఆ కష్టం నుంచి పూర్తిగా విముక్తి చేసి సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రత్యేక గుర్తింపునిచ్చి సముచిత స్థానం కల్పించినట్లు గుర్తు చేశారు. మీరు ప్రభు త్వ ఉద్యోగులుగా ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సేవలు చే యాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతుందని వివరించారు.
భావోద్వేగానికి గురైన వీఆర్ఏ
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తారని అసలు అనుకోలేదని, ఊహించనిస్థాయిలో తమకు ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా ని యమిస్తూ ఉత్తర్వులను అందజేయడం మటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉం దని హన్వాడ మండలానికి చెందిన వీఆర్ఏ భావోద్వేగానికి గురికాగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వీఆర్ఏను హత్తుకొని ఓదార్చారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, అదనపు కలెక్టర్, డీఆర్డీవో యాదయ్య, వీఆర్ఏల సంఘం జా యింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు రా మచంద్రయ్య, కోఆర్డినేటర్ గోవిందు, ఉద్యోగ సంఘాల నాయకులు రాజగోపాల్, చంద్రనాయక్, నరేందర్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 10 : మ హబూబ్నగర్ను అన్నిరంగాల్లో అభివృద్ది చేస్తామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో తిరుమలహిల్స్ నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు రూ.1.77 కోట్ల అంచనా వ్యయంతో బీటీ, సీసీ, డ్రైన్, చైతన్య సెంట్రల్ స్కూల్ రోడ్డు ఆంజనేయస్వామి ఆలయం వర కు రూ.74లక్షల వ్యయంతో వేయనున్న బీటీ, సీసీ, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అదేబాటలో మహబూబ్‌నగర్ ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందన్నా రు. పట్టణాభివృద్ధికి అవసరమైతే ఎన్ని నిధులైనా తెస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేశ్, జిల్లా జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, ఆర్ఎంవో డాక్టర్ జీవ న్, వార్డు కౌన్సిలర్ రామాంజనేయులు, నాయకులు శ్రీను, శాంతిభూషణ్, పర్వతాలుయాదవ్తోపాటు అధికారులు, వార్డు నాయకులు పాల్గొన్నారు.