వడ్డేపల్లి, సెప్టెంబర్ 4 : జాతీయ రహదారి భారత్మా ల రోడ్డు పనుల్లో భాగంగా కొంకల గ్రామ సమీపంలో ముండ్లదిన్నెకు వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టా రు. అయితే బ్రిడ్జి కింద రెండు రంధ్రాలు మాత్రమే ఉండ గా, బ్రిడ్జి పక్కన అడ్డుగోడ కూడా నిర్మించారు. దీంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు బ్రిడ్జి నుంచి ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వరద నీరంతా పంట పొలాల్లోకి చేరడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గు రవుతున్నారు.
2009లో వరదలు వచ్చి రాజోళి పరిసర గ్రామాలు మునిగిన సమయంలో కూడా ఇక్కడ పొలాలు మునగలేదని ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణంతో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి దాదాపు 50 ఎకరాల్లో పత్తి తదితర పంటలు నీట మునిగాయని బాధిత రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. అయితే బ్రిడ్జి కింద కేవలం రెండు రం ధ్రాలే ఏర్పాటు చేయడం వల్ల వర్షపునీరు ముందుకు పో వడం లేదని, దీనివల్లే పంటపొలాలను వదర నీరు ముం చెత్తుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.
అధికారులు, ప్ర జాప్రతినిధులు స్పందించి బ్రిడ్జికి కనీసం ఆరు రంధ్రాలు ఏర్పాటు చేసి వర్షాలు వచ్చినప్పుడు నీరు ముందుకు పోయేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే వర్షం వచ్చిన ప్రతి సారి నీరు పంటపొలాల్లోకి చేరడమే కాకుం డా పొలాలకు వెళ్లే దారులు కూడా మూసుకుపోయి దళితవాడ కూడా భవిష్యత్‌లో నీటమునిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌మాల రోడ్డు వంతెన పనులతో నీటి మునిగిన పంటలకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని, అదే విధం గా బ్రిడ్జి నుంచి కిందకు వర్షపునీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతు బుధవారం బాధిత రైతులు కలెక్టరేట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాధితులు నాగరాజు, వెంకట్రాముడు, మౌలాలి, హుస్సేన్, బతుకన్న, బీచుపల్లి తదితరులు అదనపు కలెక్టర్ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు.