వనపర్తి టౌన్, జనవరి 21: ధని యాప్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతూ రూ.4 కోట్లు ఖాజేసిన సైబర్ నేరగాళ్లను పట్టుకున్నట్లు సైబర్ క్రైం డీఎస్పీ రత్నం తెలిపారు. మంగళవారం సీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నకిలీ ధని యాప్‌తో మొత్తం 35 మంది సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని, అందులో సుమారుగా రూ.4కోట్లు ఖాజేసిన ఘట న తెలిసిందేనన్నారు. ఎలాంటి కష్టం లేకుండా సులభమైన పద్ధతిలో డబ్బు సంపాదించాలనే దురాశతో ధని లోన్ యాప్ ద్వారా అమాయకులను నిలువు దోపిడీకి గురిచేశారన్నారు. లోన్ మంజూరైందని, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రూ.4కోట్లకు పైగా వసూలు చేసి మోసగించారన్నారు.
గోపాల్పేట మండలం పొలికేపహాడ్కు చెందిన కావలి శివుడుకు లోన్ కావాలా అని ఫోన్ రాగా.. ధని యాప్ ద్వారా లోన్ అందిస్తామని చెప్పారన్నారు. తన బావమరిదికి అవసరముందని శివుడు చెప్పగా.. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ లోన్ కోసం వారు అడిగిన వివరాలన్ని చెప్పారని చెప్పారు. ప్రాసెసింగ్ ఫీజు ప్రకారం క్యూఆర్ కోడ్‌కు ఫోన్‌పే ద్వారా మొదటగా రూ.5,250 తర్వాత రూ.5వేలు తర్వాత రూ.2250 మరోసారి రూ.9,435 అలా మొత్తం రూ. 32,135 పంపగా ఫిర్యాదుదారుడికి అనుమానం వచ్చి సైబర్ పోర్టల్ 1930కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వెల్లడించారని చెప్పారు.
గోపాల్పేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ యాక్ట్‌పై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామన్నారు. సైబర్ బ్యూరో డైరెక్టర్ షీకాగోయేల్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. మొత్తం సైబర్ నేరగాళ్లను గుర్తించి ఈనెల 20న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుంచి దాదాపు రూ. 30లక్షల బ్రెజా కారు, జేసీబీ, నాలుగు సెల్ఫోన్లు స్వా ధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో మహబూబ్‌నగర్ మూసాపేట మండలానికి చెందిన ఎం. నరేశ్‌నాయక్, చందూనాయక్, వెంకటేశ్నాయక్ను అరెస్ట్ చేసి విచారించగా.. ఇప్పటివరకు కలకత్తా, ఢిల్లీ, పాట్నాలో ఉంటూ అంకిత్, ఫంకజ్ సహచరులు చెప్పినట్లు సైబర్ నేరాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదించాలరన్నారు. సమావేశంలో సీఐ కృష్ణ, గోపాల్పేట ఎస్సై నరేశ్, కానిస్టేబుళ్లు ఉన్నారన్నారు.
సైబర్‌నేరాలపై అవగాహన ఉండాలి
విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన ఉంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం వనపర్తి మహిళా డిగ్రీ కళాశాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ ఆండ్ అవేర్నెస్ వర్క్‌షాప్‌నకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ ఆంజనేయులు, ప్రాజెక్టు మేనేజర్ అశోక్‌కుమార్, డీపీఎంవో బాషానాయక్ తదితరులు ఉన్నారు.
ఆన్లైన్ మోసానికి గురైన వ్యక్తి
అలంపూర్, జనవరి 21: ఆన్లైన్ మోసానికి గురైన వ్యక్తి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది. బుక్కాపురం గ్రామానికి చెందిన విష్ణు 4వ తేదీన తన వాట్సాప్‌కి ఈ ఫాం, పిల్ చేయాలని ఒక టెలిగ్రాం లింక్ రాగా.. అతను లింకులో జాయిన్ అయితే క్యూకో అనే గ్రూపులో జా యిన్ అయ్యాడు. లింకులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తు లు రూ.వెయ్యి పెట్టుబడి పెడితే రూ.1300 లాభం వ స్తుందని చెప్పగా.. వెయ్యి పెట్టుబడి పెట్టగా.. రూ. 1300 పంపారు. తర్వాత బాధితుడు రూ.3వేలు, రూ.4వేలు పెట్టుబడి పెట్టాడు.. కాని నగదు రిటర్న్ రాలే దు. మీరు ఇంకా కొన్ని డబ్బులు వేస్తే ఇస్తామని నమ్మించారు. ఇదేవిధంగా అతనితో మొత్తం రూ. 8,67,000 వేశాడు. తర్వాత ఇది ఫేక్ ఇన్వెస్ట్మెంట్ అని తెలుసుకొని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.