గద్వాల, సెప్టెంబర్ 25 : ఎగువన వర్షా లు కురుస్తుండడంతో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. గురువారం జూరా ల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,55,850 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 32 గేట్ల ద్వారా దిగువకు 2,22,624 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి 27,988 క్యూసెక్కులు, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, జూరాల ప్రధాన ఎడమ కాల్వకు 1030, కుడికాల్వకు 570, భీమా లిఫ్ట్2కు 750 క్యూసెక్కుల నీటిని వి డుదల చేస్తున్నారు. జూరాలప్రాజెక్టుకు మొ త్తం ఇన్‌ఫ్లో 2,55,850 వేల క్యూసెక్కులు ఉండగా మొత్తం అవుట్ ఫ్లో 2,53,030 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల ప్రాజె క్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 కాగా 8.531 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
తుంగభద్ర, ఆర్డీఎస్లకు..
అయిజ, సెప్టెంబర్ 25 : కర్ణాటకలోని తుంగభద్ర, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. గురువారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 10,728 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 10,574 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 80.00 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1626.06 అడుగులు ఉన్నది. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 20,631 క్యూసెక్కులు ఉండగా, ప్రధాన కాల్వకు 579 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు 20,052 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 9.7 అడుగుల మేర నీటి నిల్వ ఉన్నది.
శ్రీశైలం జలాశయానికి..
శ్రీశైలం, సెప్టెంబర్ 25 : శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుంది. గురువారం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,80,903 క్యూసెక్కుల నీరు రాగా ఏడు గేట్లు పది అడుగల మేర ఎత్తి 1,87,208 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్రాజెక్టులోని కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 65,742 క్యూసెక్కులు విడుదల చేయగా మొత్తం అవుట్‌ఫ్లో 2,52,950 క్యూసెక్కులు నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.80 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.9120 టీఎంసీలు ఉన్నాయి.