Fire Accident | మహబూబ్నగర్ జిల్లా గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. మిల్లులో పత్తి నిల్వలు ఎక్కువగా ఉండటంతో వాటికి మంటలు అంటుకుని మిల్లు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికలు మంటల్లోనే చిక్కుకుని మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
జిన్నింగ్ మిల్లు యాజమాన్యం ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అర్పివేసి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.