శ్రీశైలం, జూలై 27 : శ్రీశైల జలాశయానికి ఎగువ పరివాహ క ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. శనివారం జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 18,471 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 2,91,384 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 99,736 క్యూసెక్కుల ద్వారా నీరు వచ్చి చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులకు గానూ ప్రస్తుతం 867.00 అడుగులు ఉ న్నట్లు అధికారులు తెలిపారు.
పూర్తిస్థాయి నీటిసామ ర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 130.0724 టీఎంసీలు ఉన్నాయి. జలాశయానికి 2,97,886 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కాగా, 53,795 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.