
ఆత్మకూరు, ఆగస్టు 7 : ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వరద పూర్తిగా తగ్గింది. దీంతో 21 రోజులుగా తెరుచుకున్న జూరాల ప్రాజెక్ట్ గేట్లు శనివారం మూసివేశారు. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, శనివారం మధ్యాహ్నం 8.473 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి 38,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. వచ్చిన వర ద మొత్తాన్ని విద్యుదుత్పత్తికి వినియోగిస్తున్నారు. జూలై 15 నుంచి ప్రారంభమైన వరద తాకిడి ఆగస్టు 6 వరకు నిర్విరామంగా కొనసాగింది. జూలై 17న మొదటిగా గేట్లెత్తి నీటిని దిగువకు వదలగా ఆగస్టు 6న గేట్లు మూతబడ్డాయి. 2 గేట్లతో ప్రా రంభమైన నీటి విడుదల గరిష్ఠంగా 47 గేట్లు ఎత్తి సుమారు 5 లక్షల క్యూసెక్కులను వదిలారు. క్రమంగా వరద తగ్గుముఖం పట్టడంతో శనివారం గేట్లను మూసేశారు.
గేట్ల నుంచి 425 టీఎంసీలు..
21 రోజులుగా జూరాల గేట్ల నుంచి నీటిని విడుదల చేయ గా.. ఇప్పటి వరకు స్పిల్‌వే ద్వారా 425 టీఎంసీలు వదిలారు. విద్యుదుత్పత్తికి 55 టీఎంసీలు వినియోగించగా.. మొత్తంగా 480 టీఎంసీలు వదిలినట్లు అధికారులు వెల్లడించారు. గతేడా ది సుమారు 100 టీఎంసీలు మాత్రమే విడుదల చేయగా.. ఈ ఏడాది అత్యధికంగా 480 టీఎంసీలు వదలడంతో జూ రాల ప్రాజెక్ట్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లుగా వదలడంతో శ్రీశైలం, సాగర్లు జలకళ సంతరించుకున్నాయి.గేట్లు తెరవడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. 20 రోజుల పాటు ప్రాజెక్టు పరిసరాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా ఎడమ కాలువ గట్టుపై లభించే చేపల వే పుడు విక్రయశాలల వద్ద విపరీతంగా వ్యాపారం జరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. పర్యాటకులు ఇష్టానుసారంగా డ్యాం సైట్‌కు వెళ్లి ఫొటోలు దిగడం, నిషేధిత ప్రాంతాలకు వెళ్లడం వంటివి జరగకుండా అమరచింత పోలీసులు రేయింబవళ్లు నిఘా పెట్టా రు. ప్రాజెక్ట్‌పై ట్రాఫిక్ జాం తలెత్తకుండా చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను అదుపుచేశారు. డ్యాం సైట్లో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఎస్సై ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో 20 రోజుల పాటు అమరచింత పోలీసులు పహారా నిర్వహించారు.