జోరుగా ఇసుక దందా..

మిడ్జిల్, జనవరి 21 : మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నది. నెల రోజలుగా స్తబ్ధుగా ఉన్న ఇసుకాసురుల వ్యాపా రం మళ్లీ ఊపందుకున్నది. కొందరు అధికారులు సైతం చేదోడుగా నిలుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దుందుభీ వాగు నుంచి రాత్రికి రా త్రే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కేసు లు నమోదు చేసి, వాల్టా చట్టం కింద వాహనాలను సీజ్ చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల ను స్థానిక అధికారులు బేఖాతరు చేస్తున్నారు. మిడ్జిల్, మున్ననూరు, వాడ్యాల, కొత్తూరు, కొత్తపల్లి గ్రామాల మీదుగా నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నారు. ఫిర్యాదులు వస్తే కానీ స్పందించలేమంటున్న పోలీస్, రెవెన్యూ అధికారుల వ్యవహారశైలి విమర్శలకు తావిస్తున్నది.
‘వాల్టా చట్టం ప్రకారం పట్టుబడిన ఇసుక ట్రా క్టర్కు రూ.లక్ష జరిమానా విధించాలి. అదే ట్రా క్టర్ రెండోసారి పట్టుబడితే కేసుతోపాటు రూ.లక్ష జరిమానా వేయాలి. అధికారులు ఆ ఊసెత్తడం లేదు. కేసు పూర్వాపరాల నమోదులో పాత కేసు వివరాలు పొందుపరచాలి’ అయితే, అధికారులు ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టుబడిన ట్రాక్టర్లకు నామమాత్రపు జరిమానా విధిస్తూ అధికారులు అడ్డదారిలో కాసులు దండుకుంటున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై రాత్రి వేళలో గస్తీ నిర్వహించి కేసులు నమోదు చేస్తామని, అనుమతులు లేకుంటే వాల్టా చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని తాసిల్దార్
తాజావార్తలు
- ఉత్సాహంగాకదన రంగంలోకి..
- నగర దారులు వాహన బారులు
- పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం
- పేదలకు అండగా ప్రభుత్వం
- ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం
- సభ్యత్వ నమోదులో సైనికుడిలా పనిచేయాలి
- సెట్విన్ కేంద్రాల్లో ప్రతిభా పోటీలు
- డివిజన్ల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు
- పనులను త్వరగా పూర్తి చేయాలి
- లక్ష్య సాధన కోసం సభ్యత్వాలు