మంగళవారం 26 జనవరి 2021
Mahabubnagar - Dec 06, 2020 , 03:01:14

ఓటరు పరిశీలన పక్కాగా ఉండాలి

ఓటరు పరిశీలన పక్కాగా ఉండాలి

  • రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌, భూరికార్డుల కమిషనర్‌ శశిధర్‌ 

మహబూబ్‌నగర్‌: జిల్లా వ్యాప్తంగా ఓటరు వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌, భూరికార్డుల కమిషనర్‌ శశిధర్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మోడ్రన్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. సవరణ కార్యక్రమాన్ని పక్కాగా పరిశీలించాలని సూచించారు. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను పరిగణలోకి తీసుకుని ఓటరు గుర్తింపు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. 


logo