శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Mahabubnagar - Aug 09, 2020 , 02:05:17

ఆత్మబంధువు.. నంది ఎల్లయ్య

ఆత్మబంధువు.. నంది ఎల్లయ్య

  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  •  ప్రజాసేవకే ‘నంది’ జీవితం అకింతం 
  •  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతికి సంతాపం   


 మహబూబ్‌నగర్‌/వనపర్తి :  మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తీవ్రంగా కలచి వేసిందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆరు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించిన ఎల్లయ్య అభ్యున్నతి కోసం ఆ జన్మాంతం పాటుపడ్డారని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. ఆయన మృతి ప్రజలకు తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. logo