Kothakota | కొత్తకోట : కొత్తకోట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి హైదరాబాద్‌లో స్థిరపడిన కొత్తకోట మండల కనిమెట్ట గ్రామానికి చెందిన కలకొండ మణిమాల రవి ప్రకాష్ దంపతులు రూ.2,51,116ల విరాళాన్ని అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు ధూపం నాగరాజుకు అందజేశారు. కొత్తకోట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో 1987-88 కు బ్యాచ్‌కు చెందిన మణిమాల వారి మిత్రబృందం ధూపం నాగరాజు, పొగాకు రాఘవేంద్ర ప్రసాద్, నారాయణదాసు విశ్వమోహన చారి, భీమ అమృత రవి, గుడిబండ నాగిరెడ్డి, వేణు, నరహరి చారి, గన్నోజి వెంకటేష్, మురళి, తాజ్ మోల్, వసంతలక్ష్మి, మంజుల, భవాని, చంద్రకళల సూచన మేరకు వారి మిత్రబృందం చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవాసమితి సభ్యులు దాతలను శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.