తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిపీఠమెక్కిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివి. అధికారంలోకి రాగానే వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం.’
నెట్వర్క్ మహబూబ్‌నగర్, జూన్ 21 ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలకు ముందు గులాబీ పార్టీ అధినేత, ఉద్యమ నేత కేసీఆర్ ఇచ్చిన హామీ ఇది. అన్న మాట ప్రకారం, అధికారంలోకి రాగానే అమరుల కుటుంబాలకు సీఎం కొండంత అండగా నిలిచారు. ఇంటికి పెద్ద కొడుకులా మారి వారి కుటుంబాల బాధ్యతను మోశారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున సాయం చేసి భరోసానిచ్చారు. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వెలుగులు నింపారు. తమవాళ్లు లేరనే లోటు ఉన్నా, ప్రభుత్వ సాయం, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రగతి చూసి సంబురపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 17 మంది ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేయగా.. తెలంగాణ ఏర్పడి ఏడాది పూర్తి గాక ముందే కొలువులిచ్చి ఆయా కుటుంబాలను ఆదుకున్నారు. దీంతో నేడు వారి ఫ్యామిలీలోని పిల్లలూ ప్రయోజకులుగా మారారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వారిని స్మరిస్తూ కొందరు అమరుల కుటుంబాల స్థితిగతులపై ‘నమస్తే తెలంగాణ’ కథనం..
ఉమ్మడి రాష్ట్రంలో ‘అన్నమో రామచంద్ర’ అంటూ పొట్ట చేతబట్టుకుని ఉన్న ఊ రును విడిచిపెట్టి పట్టణాలకు వెళ్లి తమ జీవనాన్ని కొనసాగించారు. నీళ్లు, నిధులు, నియామకాలు జరగాలం టే ఒక్క తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమని, పోరాడిన ఉద్యమకారులు ఎందరో వారి ప్రాణాలను ఫణంగా పెట్టి ఆత్మబలిదానాలు చేశారు. వీరిని నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలు వీధిన పడకుండా స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ వారిని అక్కున చేర్చుకొని రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించారు. తర్వాత సిద్ధించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ ఉద్యమకారుల కుటుంబాలను అక్కున చేర్చుకున్నారు. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ క్రమంలో మా అమ్మ సత్యమ్మ ఆత్మార్పణం చేసి ఉద్యమానికి ఊపిరైంది. స్వరాష్ట్రంలో తెలంగాణ తల్లి నాకు అమ్మ అయ్యిందని సత్యమ్మ కుమారుడు నాగరాజు తెలిపారు.
పోతే ఒక్క ప్రాణం.. వస్తే తెలంగాణ..
‘తెలంగాణ రావాలి.. అప్పుడే మరుగున పడ్డ బతుకులకు జీవం వస్తుంది.. పోతే నా ఒక్క ప్రాణం.. తెలంగాణ వస్తే నా లాంటి ఎంతో మంది జీవితాల్లో వెలుగు వస్తుందని ఆరాట పడేది. చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, బీడు బారిన భూముల్లో సాగునీరు పారాలన్నా.. ఇలా ఎన్నో రంగాల్లో ముందుకు అడుగులు వేయాలన్నా ఒక్కటే మార్గం.. అందే తెలంగాణ సిద్ధించాలి.. ఇలా ఉద్యమ కాలంలో నిత్యం తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను చూసి చలిచింది.. తెలంగాణ వస్తదో.. రాదో అన్న సంశయంలో .. 2010 జనవరి 20వ తేదీన తెలంగాణ ఏర్పడడం.. సీఎంగా కేసీఆర్ మారాక రోడ్డున పడిన మా కుటుంబానికి పెద్దన్నలా మారారు. నాకు ప్రభుత్వ ఉద్యోగమిచ్చారు. కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు’ అని సత్యమ్మ కుమారుడు నాగరాజు కన్నీటిపర్యంతమయ్యాడు.
కుటుంబ నేపథ్యం..
సత్యమ్మ భర్త కృష్ణయ్య. వీరికి కూతురు నాగలక్ష్మి, కుమారుడు నాగరాజు ఉన్నారు. వీరికున్న రెండెకరాల పొలంలో పంటలు పండిస్తూ జీవించేవారు. మిగితా సీజన్లలో కూలి పనిచేసేటోళ్లు.. కూతురి వివాహం జరిపించాక సత్యమ్మ ఆత్మార్పణం చేసుకున్నది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం నాగరాజుకు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం వచ్చింది. దీంతోపాటు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది.
మా అమ్మ బతికుంటే సంతోషపడేది..
తెలంగాణ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఉద్యమంలో మా అమ్మ ఆత్మబలిదానం చేసుకున్నదని, ఆమె కలలు నేడు స్వరాష్ట్రంలో తీరుతుండడం సంతోషంగా ఉంది. బీటలు బారిన చెరువుల్లో సాగు నీళ్లు రావడం, వలసలు వెళ్లిన మా ప్రాంతంలో తిరిగి రావడం.. వ్యవసాయం పండుగలా జరగడం.. కులవృత్తులకు పూర్వ వైభవం రావడంతో గ్రామాల్లోనే సంతోషంగా జీవించడం.. ఇలాంటి చిరునవ్వుల్లో మా అమ్మ ఎప్పటికీ కనిపిస్తుంది. ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆర్థిక సాయంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. అమ్మ పోయిందన్న బాధ ఉన్నప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి అక్కున చేర్చుకోవడం ఆనందాన్నిచ్చింది. సీఎం కేసీఆర్‌కు మా అమరుల కుటుంబాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
– సత్యమ్మ కుమారుడు నాగరాజు
మా ఇంటి పెద్ద కొడుకు సీఎం కేసీఆర్
మహబూబ్‌నగర్, జూన్ 21 : కన్నతల్లి పేగుబం ధం కంటే ప్రేమ మరెక్కడా కనిపించదంటారు మన పెద్దలు. ఆ మాటలు ఆ తల్లిని ఎంతో గాయపర్చిన తె లంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు ప్రాణానికి ప్రాణమైన కుమారుడు మరణించినా ఎంతో మం ది గుండెల్లోబతికే ఉన్నాడు అంటుంది తెలంగాణ అ మరవీరుడు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సం జయ్నగర్ ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి తల్లి యాదమ్మ. తెలంగాణ రాష్ట్ర అవతరించి పదేండ్లు అవుతున్న సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ అమరవీరుడు అనిల్‌కుమార్‌రెడ్డి ఇంటికి చేరుకొ ని పలకరించింది. ఆమె మాటల్లోనే..
రూ.10 లక్షలు, ఇచ్చిండు..
నా కొడుకు, నా భర్త చనిపోయిన తర్వాత మాకు ఏమి చేయాలో తెలువలే. చేసేటోల్లు పోయిండ్రు ఇం కా ఎలా బతకాలి అనుకున్నాం. సీఎం కేసీఆర్ చెప్పినట్టు మాకు రూ.10 లక్షలు ఇచ్చిండ్రు. నా కొడుకుకు పట్వారీ నౌకరీ ఇచ్చిండ్రు. గిప్పుడు గా బస్టాండ్ దగ్గర ఉన్న ఆడ పిల్లల కాలేజ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా చేస్తాండటా. నాకు చెప్పనికే రాదు. ఇచ్చిన పైసలతో మంచిగానే ఇల్లు కట్టుకున్నాం. పెద్ద కొడుకు రాజేందర్‌రెడ్డికి జాబ్ రావడంతో సల్లంగా బతుకున్నాం. నాకు మూసలోళ్ల పింఛన్ వస్తుంది. దీంతో మంచిగానే ఉన్నాం. సీఎం కేసీఆర్ సారూ ఎంతో కష్టపడి మనందరికీ మంచిగా చేస్తుండు. గింత మంచిగా చేసే సర్కారు ఎక్కడా లేదు. బయటకు పోయినప్పుడు ఎవరినైనా అడుగుతా గిప్పుడు కూడ కేసీఆర్‌ను గెలిపించుకోవాలంటే సరే అంటారు. గింతకంటే ఇకేం మంచిగా ఉంటది. సీఎం సారూ మంచిగా చేస్తుండయ్యా. ఆడపిల్లల పెళ్లికి కూడా పైసల్ ఇస్తుండు. నేను ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ ఉండాలని ఉందయ్యా..
హోటల్ ఉండె.. బస్టాండ్‌లో బైక్స్టాండ్ నడిపినం..
నా పేరు యాదమ్మ. మా రెండో కొడుకు అనిల్‌కుమార్ మార్చి 12, 2012 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉరేసుకుని చనిపోయిండు. నే ను చనిపోతేనన్నా తెలంగాణ ఇవ్వాలి అని ఎప్పుడూ అంటుండే. అట్లా కాదు అయ్యా అంటూ నా భర్త నా రాయణరెడ్డి ఎప్పుడు నా బిడ్డకు చెబుతుండే. నేను ఎ న్నోసార్లు చెప్పిన నా బిడ్డ అనిల్ వినపాయే. ఎవరు లేంది చూసి ఉరేసుకుని చనిపోయే. నా కొడుకు లేదనే బాధ ఎంతో ఉంది. తెలంగాణ వచ్చింది.. మం చిగా అభివృద్ధి జరుగుతుంది అని నా బిడ్డ చూడకపా యే అనేబాధ చాలా ఎడుపోస్తుంది అంటూ కన్నీరుపెట్టింది. నా మొగుడు నారాయణరెడ్డి చదువుకునిం డే. బస్టాండ్‌లో హోటల్, బైక్‌లు ఆపుకునే స్టాండ్‌ను రెండు, మూడు లక్షలు అప్పు చేసి టెండర్లో తీసుకుని నడిపినాం. పెద్ద కొడుకు రాజేందర్‌రెడ్డి, మా ఆయన ఇద్దరూ చూసుకునేటోళ్లు. చనిపోయిన అనిల్ ఎప్పుడు తెలంగాణ తెలంగాణ అంటూ తిరుగుతుం డె. ఎందుకు రా లొల్లిల పోతున్నాయి.. అని మేము ఎన్నో సార్లు చెప్పినం. అయినా వినకుండె.. చూసి చూసి తెలంగాణ రావాలి అంటూ చనిపోయిండు. మా బాధ చెప్పలేనంతగా ఉండేది. నా కొడుకు మర ణం చూసిన నా భర్త నారాయణరెడ్డి ఆరు నెలల్లోనే చనిపోయిండు. నా పిల్లగాడు నేను రోడ్డున పడ్డాం. అప్పుడు ఎవరూ మమల్ని పట్టించుకోలే. అప్పులు చే సి ధర్నాల దగ్గరికీ తిరిగిన్నాం. ఎట్లాయినా తెలంగాణ రావాలి అంటూ చాలా తిరిగి లొల్లులకు పోతుంటిమి. ఇక తెలంగాణ ఇస్తున్నాం చెప్పడం టీవీల చూసినం. చాలా మంచిగా అనిపించింది. నా బిడ్డ అనిల్ మర ణం ఊరికే పోలేదు అనుకున్నాం. తెలంగాణ వస్తుందంటూ చాలా సంతోషపడినం. కేసీఆర్ సీఎం అయినంక మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం చె ప్పిండు. అప్పుడు మాకు జర ధైర్యమొచ్చింది.
చిన్న కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం
జడ్చర్ల, జూన్ 21 : ‘మాది తిమ్మాజిపేట మండలం కోడుపర్తి.. నా కొడుకు పగలు, రా త్రి తేడా లేకుండా తెలంగాణ ఉద్యమంలో తిరిగేటోడు. ఎప్పుడు చూసి నా తెలంగాణ అం టూ ఉండేటోడు. డిగ్రీ చదువుకున్న నా కొడు కు ఉద్యోగం కోసం ఎదురు చూసేవాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఉద్యోగాలు అంటుండేవాడు. 2010 ఫిబ్రవరి 2న ఒక రోజు మధ్యరాత్రి తెల్లవారుజామున పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. అక్కడ పేపర్ మీద తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నానని, నేను చనిపోతేనైనా తెలంగాణ రాష్ట్రం వస్తదేమో.. అని రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం నా భర్త పెంటయ్య పొలం వద్దకు వెళ్లగా.. కొడుకు చనిపోవడంతో బోరున విలపించాడు. రాష్ట్ర ఏర్పాటును నా కొడుకు చూసుంటే ఎంతో సంతోషించేటోడు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. కుటుంబానికి రూ.10 లక్షల సాయంతోపాటు ఉద్యోగమిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం’.. అని అమరుడు మల్లేశ్ తల్లి మణెమ్మ చెప్పింది.
మా అన్న చనిపోతే నాకు ఉద్యోగం వచ్చింది
మా అన్న మల్లేశ్ తెలంగా ణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేటోడు. ఎవరితో మా ట్లాడినా రాష్ట్రం గురించే చ ర్చ. ఒక రోజు రాత్రి వ్యవసా య పొలానికి వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్య చే సుకున్నాడు. తర్వాత తెలంగాణ ఏర్పాటు కావడం.. సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీ కారం చేపట్టడం.. అమరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 2016లో రూ.10 లక్షలతోపాటు నాకు కళాశాలలలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. నేను ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాను.
– అమరుడు మల్లేశ్ తమ్ముడు వేణుగోపాల్
ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచారు
బాలానగర్, జూన్ 21 : ‘తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల బతుకులు బాగుపతాయని, కేసీఆర్ సార్ కలలు గన్న స్వ రాజ్యం రావాలని ఎప్పుడూ అంటుండే.. ర్యాలీ నిర్వహించి నా.. ధర్నా, రాస్తారోకో చేసినా అక్కడికి పోయేటోడు. సకల జనుల సమ్మెలో పాల్గొంటూనే తెలంగాణ వస్తదన్న నమ్మకంతో బతికేటోడు..’ 2011లో ప్రత్యేక రాష్ట్రం రాదేమోనన్న అనుమానంతో చెన్నయ్య మృతి చెందాడు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. రూ.10 లక్షల సాయంతోపాటు చెన్నయ్య భార్య రాములమ్మకు మహబూబ్‌నగర్ బీసీ హాస్టల్లో వంట మాస్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు.
తెలంగాణ మీదే ధ్యాస..
నా భర్త కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. తెలంగాణ రావాలి, అప్పుడే మన బతులకు బాగుపడతాయ ని అంటుండేటోడు. పగలు, రాత్రి ఉద్యమం కోసం తిరిగేవా డు. 2011 సెప్టెంబర్ 7న మా గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. నేను చనిపోతేనే తెలంగాణ వస్తదేమో.. బతుకులు మారుతాయేమోనని ఆశించాడు. ఆయన కల తీరింది. తెలంగాణ ఏర్పడింది. అభివృద్ధి బాగా జరుగుతున్నది. నా భర్త ఉంటే ఎంతో సంతోషించేటోడు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసానిచ్చింది.
ఇద్దరి కూతుళ్ల పెండ్లి చేశా..
నా భర్త చెన్నయ్య తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో సార్లు లాఠీ దె బ్బలు తిన్నాడు. అరెస్టు అయ్యాడు. మాది పేద కుటుంబం. సరిగ్గా తినడానికి తిండి కూడా ఉండేది కాదు.. అ యినా మా ఆయన తెలంగాణ రావాలని ఎంతో ఆకాంక్షించాడు. రాష్ర్టాన్ని, అభివృద్ధి చూడకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత నాడు బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ఉన్న బాలరాజు కృషితో ప్రభుత్వం నుంచి మా కుటుంబానికి రూ. 10 లక్షలు వచ్చాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. మొదటగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం లో బీసీ హాస్టల్లో వంట మనిషిగా పని చేశాను. ఇప్పుడు వనపర్తి జిల్లా గోపాల్పేట హాస్టల్లో వంట మనిషిగా పని చేస్తున్నాను. ప్రభు త్వ సాయంతో ఇద్దరి కూతుళ్ల పెండ్లి చేశా.. మిగిలిన కొద్ది మొత్తంతో అప్పులు తీర్చాను. సీఎం కేసీఆర్ దయతో మా కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నారు. మా పాలిట దేవుడు కేసీఆర్ సార్. నా కొడుకు టెంట్ హౌస్‌లో పనిచేస్తున్నాడు.
– రాములమ్మ, గౌతాపూర్, బాలానగర్ మండలం
మా పాలిట దేవుడు కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో మా నాన్న ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. మేం అనాథలుగా ఉండటా న్ని ప్రభుత్వం గుర్తించి మా అమ్మకు ఉద్యోగం కల్పిం చడంతోపాటు రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బుతో అక్కల పెండ్లి చేశాం. మిగతా పైసలు అ ప్పులు కట్టి, బాలానగర్‌లో ఒక ప్లాటు కొన్నాను. ఇ ప్పుడు బాగానే ఉన్నాము.. కేసీఆర్ సార్‌కు మా కుటుంబం రుణపడి ఉంటుంది. నేను మా బాబాయి ఇంటి వద్ద ఉంటూ టెంట్‌హౌస్ నిర్వహిస్తున్నా.
– అమరుడు చెన్నయ్య కుమారుడు శివ కుమార్
కుటుంబానికి పెద్దన్న సీఎం కేసీఆర్
సీమాంధ్ర పాలనలో తెలంగాణ అన్నా.. ఇక్కడి ప్రజలు అన్నా చిన్న చూపు.. సామాన్యుడు మంచిగా బతకలేని స్థితి.. ఇవన్నీ మారాలన్నా.. వలసలు తగ్గాలన్నా తెలంగాణ రావాల్సిందే.. అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ అధ్యక్షతన తిరుగుబాటు ప్రారంభం కాగా.. గ్రామం నుంచి మొదలుకొని పట్టణంలోని చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రజలు సైతం పిడికిలి బిగించి ఉద్యమానికి ఊపిరిపోశారు. ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడింది. అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న తరుణంలో ఉమ్మడి పాలకులు అణగదొక్కే ప్రయత్నం చేయడంతో అలసిపోయిన కొందరు ఆత్మబలిదానాలను చేసుకున్నారు. ఇదే క్రమంలో వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన వీరసాగర్ 2013 అక్టోబర్ 12వ తేదీన కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మండలకేంద్రంలో ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడింది.
కుటుంబ నేపథ్యం..
పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన బాలస్వామి, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు వీరసాగర్. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించే వీరసాగర్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. తెలంగాణ వ స్తేనే సామాన్యుల బతుకులు మారుతాయంటూ.. నిత్యం అదే ధ్యాసలో ఉండేటోడు. అ మ్మ, నాన్నకు ఒక్కడివే.. మ నకెందుకు అని కుటుంబీకు లు చెబితే తెలంగాణ రావా లి, అప్పుడే మనలాంటి సా మాన్యుల బతుకులు మారుతాయని చెప్పి బాధపడేవా డు. తెలంగాణ ఉద్యమం అ ణగదొక్కుతున్న ఆంధ్రా నా యకుల కక్షలను చూసి ఆత్మబలిదానం చేసుకున్నాడు.
ఆదుకున్న ప్రభుత్వం..
వీరసాగర్.. తెలంగాణ ఉ ద్యమం కోసం ఆత్మ బలిదా నం చేసుకున్నాడు. స్వరాష్ట్రం లో సీఎం కేసీఆర్ అమరవీరు ల కుటుంబాన్ని ఆదుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉ ద్యోగాలు, రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అం దులో భాగంగా వీరసాగర్ కుటుంబంలో రెండో అక్క పద్మకు కొత్తకోట మండల కేంద్రంలోని బీసీ గురుకుల హాస్టల్లో వంట మనిషి ఉద్యోగం వచ్చింది. అలాగే కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించారు. తమ్ముడు వీరసాగర్ లేడన్న బాధ ఉన్నప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిలో తన తమ్ముడు ఎప్పటికీ బతికే ఉంటాడని పద్మ గుర్తు చేసింది.
మా తమ్ముడి చివరి కోరిక నెరవేరింది..
తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కగానొక్క తమ్ము డు వీరసాగర్ ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఎదిగొచ్చిన తమ్ముడు చనిపోవడం, అప్పటికే తల్లిదండ్రులు మృతి చెందడంతో మా కుటుంబం రోడ్డున పడిన పరిస్థితి. ఇదం తా గుర్తించిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతోపాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. గడిచిన 9 ఏండ్లలో వీరసాగర్ అనుకున్న దానికి పదింతలు అభివృద్ధి జరిగింది. నీళ్లు వచ్చాయి. పంటలు పండుతున్నాయి, ప్రభుత్వ దవాఖాన లు, గురుకులాలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఎన్నో పథకాలు అమలు చేస్తూ పేదల కండ్లల్లో సీఎం కేసీఆర్ ఆనందం చూస్తున్నారు. ప్రతి సామాన్యుడు తెలంగాణలో కాలర్ ఎగరేసి తిరగాలన్న మా తమ్ముడు వీరసాగర్ చివరి కోరిక నెరవేరింది.
– వీరసాగర్ అక్క పద్మ, పెద్దమందడి మండలం