గద్వాల, జూలై 6 : జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడా ది జూరాల ప్రాజెక్టుకు ముందస్తు వరద కొనసాగుతుండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జూలై చివరి వారంలో లేదా సెప్టెంబర్ నుంచి మొదలయ్యే సాగు పనులు ప్రస్తుతం రైతులు ఇప్పటికే ప్రారంభించారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 1,13,,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 12 గేట్ల ద్వారా దిగువకు 79, 920 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
విద్యుత్ ఉత్పత్తికి 29,296 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా భీమా లిఫ్ట్-1కు 650, భీమాలిఫ్ట్-2కు 750, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల ఎడమ ప్రధాన కాల్వకు 550, కుడి కాల్వకు 290, ఆర్డీఎస్ కాల్వకు 150, సమాంతర కాల్వకు 750 క్యూసెక్కు ల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్ ఫ్లో 1,11,804 క్యూసెక్కులుగా నమోదైంది. జూరా ల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.535 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అయిజ, జూలై 6 : కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని హోస్పేట్లోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. దీంతో తుం గభద్ర డ్యాం 19 క్రస్ట్ గేట్లు 2.5 అడుగుల మేరకు ఎత్తి దిగువకు 60,104 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం టీబీ డ్యాం ఇన్‌ఫ్లో 52,308 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 62,444 క్యూసెక్కులు ఉన్నది.
105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 77.343 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1625.26 అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. టీబీ డ్యాం గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేయడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి ప్రవాహం పెరుగుతున్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 68,805 క్యూసెక్కులు ఉండగా, ప్రధాన కాల్వకు 595 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా రు. దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు 68,210 క్యూసెక్కు లు చేరుతున్నాయి. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 11.8 అడుగుల మేర నీటి నిల్వ ఉన్నట్లు ఆర్డీఎస్ ఏఈ తెలిపారు.
రాజోళి, జూలై 6 : రాజోళి మండల సరిహద్దులో ఉన్న సుం కేసుల డ్యాంకు ఎగువ నుంచి వరద కొనసాగుతున్న ది. దీంతో ఆదివారం ప్రాజెక్టులోని 17 గేట్లు ఎత్తి 67,218 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 290.50 మీట ర్లు ఉన్నట్లు ఏఈ మహేందర్‌రెడ్డి తెలిపారు.
దేవరకద్ర, జూలై 6 : జిల్లాలోని భారీ నీటి పారుదల ప్రాజెక్టు అయిన కో యి ల్‌సాగర్ జలకళ సంతరించుకుంది. గత కొన్ని రోజుల నుంచి జూరాల నుంచి కో యిల్‌సాగర్ ఎత్తి పోతలకు నీరు విడుదల చేస్తుండడంతో ఆదివారం సాయంత్రం వరకు ప్రాజెక్టులో నీటిమట్టం 23 ఫీట్లకు చేరింది. కో యిల్‌సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ స్థోమత 32.5 ఫీట్లు కాగా మరో 9.5 ఫీట్ల నీరు చేరితే ప్రా జెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉన్నది. ప్రాజెక్టులో రోజు రోజు నీటి మట్టం పెరుగు తుండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం, జూలై 6 : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ద్వారా 29,388 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 79,920 క్కూసెక్కులు, సుంకేసుల నుంచి 66,589వేల క్యూసెక్కుల నీరు విడుదలై సాయం త్రానికి 1,44,652 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరింది. అదేవిధంగా జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 8790.20 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 183.8486 టీఎంసీలు ఉన్నాయి. కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 60,758 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. అయితే ఇన్‌ఫ్లో పెరిగితే మరో రెండు రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తి నాగర్జునసాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నది.