మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మార్చి 20 : ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలు ఎం తో కీలకం. ఒత్తిడి అధికం గా ఉండే ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండటంతోపాటు మానసికంగా చురుకుగా ఉంటే విజయం సా ధిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘పది’ పరీక్షల ను 45,574 మంది విద్యార్థులు రాయనుండగా, ఇం దుకు 235 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభమై ఏ ప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తా రు. భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ప రీక్షలు మాత్రం ఉదయం 9:30 నుంచి 11:00గంటల వరకు మాత్రమే ఉంటాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో వసతులను జి ల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. కొన్ని కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో పరీక్షలు సజావుగా జరిగేందుకు విద్యా, పోలీసు, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖలు ఆయా జిల్లా కలెక్టర్ల ఆదేశాల మే రకు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఉక్కపోత, తాగునీటి స మస్యలు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు వీలుగా ఎంఈవోలు, కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆయా జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారితోపాటు సిట్టింగ్స్కాడ్స్ అందుబాటులో ఉండనున్నారు. ఆకస్మిక తనిఖీలకు గానూ జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో నాలుగు నుంచి ఆరుగు ప్లయింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. వీరితోపాటు 20మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,280 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.