కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 13 : పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ సమీపంలోని లిఫ్ట్-1 సర్జ్‌పూల్‌ను కృష్ణమ్మ ముంచెత్తింది. మంగళవారం జీరో పాయింట్ నుంచి ఓపెన్ కెనాల్ మీదుగా హెడ్‌రెగ్యులేటరీ మీదుగా నీటిని విడుదల చేయగా.. టన్నెళ్ల మీదుగా సర్జ్పూల్కు నీరు చేరింది.
అయితే 0.006 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మహాబాహుబలి మోటర్లు (ఒక్కోటి 145 మెగావాట్ల సామర్థ్యం) బిగించారు. 16వ తేదీన సీఎం కేసీఆర్ వెట్న్‌న్రు ప్రారంభించనున్నారు. దీంతో ముందుగానే టెస్టింగ్ కోసం నీటిని తరలించినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. క౨ష్ణనదికి ఎంత వరద వచ్చిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎలాంటి హాని కల్గకుండా హెడ్ రెగ్యులెటర్ను ఏర్పాటు చేశారు. సర్జపూల్లో దాదాపు ఒక టీఎంసీ నీటి నిల్వ ఉంటుంది.