జడ్చర్ల టౌన్, డిసెంబర్ 9 : స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాలబాలికల ఫుట్‌బాల్ పో టీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. శనివారం (రెండురోజు) బాదేపల్లి జెడ్పీ హైస్కూల్ మైదానంలో ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన బాలుర, బాలికల జట్లు తలపడ్డాయి. మొదటగా లీగ్ మ్యాచుల్లో తలపడిన నాలుగు జిల్లాల బాలికల జట్లు సెమీస్‌కు చేరగా, బాలుర జట్లు లీగ్ మ్యాచ్‌ల్లో పోటీపడుతున్నాయి. అండర్17 విభాగంలో 67వ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్జీఎఫ్ రాష్ట్ర అసిస్టెంట్ ఆర్గనైజర్ రామకృష్ణ, వనపర్తి జిల్లా ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సురేందర్‌రెడ్డి, అండర్19 ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పాపిరెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకొని అభినందించా రు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు. బాదేపల్లి జెడ్పీ హైస్కూల్లోని రెండు వేర్వేరు మైదానాల్లో బాలురు, బాలికల ఫుట్‌బాల్ పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాలకు చెందిన జట్లు మ్యాచ్‌లో తలపడగా పోటీలను తిలకించేందుకు పట్టణవాసులతోపాటు ఫుట్‌బాల్ అభిమానులు అధిక సంఖ్యలో తరలొచ్చారు.
సెమీస్‌కు చేరిన బాలికల జట్లు
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో భాగంగా లీగ్ మ్యాచ్‌లు గెలిచిన రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, మెదక్ జిల్లాల బాలికల జట్లు సెమీస్‌కు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు. బాలుర విభాగంలో మరిన్ని లీగ్మ్యాచులు పూర్తికావాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం గెలుపొందిన జట్లకు సెమీస్‌తోపాటు ఫైనల్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేశ్‌బాబు, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ మొయిన్, కృష్ణయ్య, బాలరాజయ్య, ఆనంద్, కుమార్, శారదాబాయి, ఉమాదేవి, జ్యోతి, రాములు, రాజవర్ధన్‌రెడ్డి, వెంకటమ్మ, టోర్నమెంట్ పరిశీలకులు ప్రేమ్‌కుమార్, భావన, అంఫైర్స్ వడెన్న, భానుకిరణ్, రాము, నరేశ్, శ్రీకాంత్, నిఖేష్ తదితరులు పాల్గొన్నారు.