శ్రీశైలం, ఫిబ్రవరి 24 : అఖండమైన జ్ఞానానికి ప్రతీకై న హంసను వాహనంగా చేసుకుని సకల కళలకు అధిపతి అయిన పరమేశ్వరుడు ఙ్ఞాన శక్తి అయిన అమ్మవారితో కలి సి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు పూజాధికాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. గురువారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. సాయంకాలార్చనలు హోమాల అనంతరం స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు చేసి ప్రధాన వీధుల్లో ఊరేగించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నంది మండపం నుంచి బయలు వీరభధ్ర స్వామి వరకు ఆద్యంతం కనుల పండువగా సాగింది. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతోపాటు స్వామిఅమ్మవార్లకు ఆస్థానసేవ జరిగింది. ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు శుక్రవారం ఆదిదంపతులు మయూర వాహనంపై ఊరేగనున్నారు. గ్రామోత్సవంలో ఈవో లవన్న, అసిస్టెంట్ కమిషనర్ నటరాజ్, ఈఈ మురళీ బాలకృష్ణ, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈవోలు హరిదాస్, ఫణీంద్రప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్‌కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్ సె క్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ అయ్య న్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.