
పెద్దమందడి, నవంబర్ 1 : రైతులను సంఘటితం చేసేందుకే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని, సాంప్రదాయ సాగుకు స్వస్తి చెప్పి డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని ఆరు రైతువేదికల్లో అన్నదాతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బలిజపల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని 41 రైతువేదికల్లో ఏకకాలంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు. రైతులు సాంప్రదాయ సాగు బదులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలన్నారు. చిరుధాన్యాలతోపాటు ఉద్యాన పంటలపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. పండ్ల తోటలు, ఆయిల్‌పాం, నూనె గింజలు, నిమ్మగడ్డి తదితర పంటలకు డి మాండ్ ఉందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో అధునాత న సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు కృషి చేస్తామన్నారు. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. త్వరలో వనపర్తి నియోజకవర్గ స్థా యిలో 25 వేల మంది అన్నదాతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని, వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ అనుబంధ సంఘాల మిత్రుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పా రు. అలాగే వెల్టూర్ క్లస్టర్లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, పెద్దమందడి క్లస్టర్లో ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి, మోజర్లలో ఎంపీపీ మేఘారెడ్డి, మనిగిల్లలో పెబ్బేరు మున్సిపల్ వైస్‌చైర్మన్ కర్రెస్వా మి, పామిరెడ్డిపల్లిలో రైతుబంధు సమితి మం డలాధ్యక్షుడు రాజాప్రకాష్రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి మల్లయ్య, సింగిల్‌విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు సత్యారెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, సరిత, సునీత, వెంకటస్వామి, సిద్ధయ్య, సతీశ్, వరలక్ష్మి, సువర్ణ, సూర్యచంద్రారెడ్డి, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి కో అధికారులు, రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం..
రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గోపాల్పేట, మున్ననూర్, బుద్దారం, పొల్కెపహాడ్, ఏదుట్ల, ఏదుల గ్రామాల్లోని రైతు వేదికల్లో అన్నదాతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గోపాల్పేట, పొల్కెపహాడ్, బుద్దారం గ్రామాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డిజిటల్ స్క్రీన్లతో రైతువేదికల ద్వారా వ్యవసాయ సమాచారం అందించేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామన్నారు. మార్కెటింగ్ నెట్‌వర్క్‌ను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసేలా చర్యలు చేపడుతామన్నారు. రైతు రాజ్యంగా, రాష్ట్రంగా నిలవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. అంతకుముందు రైతులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. శాలువా, పూలమాలతో సత్కరించారు. పొల్కెపహాడ్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు జనుంపల్లి అనురాధ 12 మంది రైతులను శాలువా, పూలమాలతో సత్కరించారు. రైతువేదికల వద్ద భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భార్గవి, ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతియాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోదండం, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఏవో నరేశ్, ఏఈవోలు నాగరాజు, సుప్రజ, పవన్‌కుమార్, మోహిత, వెంకటేశ్, సర్పంచులు శంకర్‌నాయక్, బాల్‌రెడ్డి, పద్మమ్మ, వసంత, శేషిరెడ్డి, శ్రీనివాసులు, లక్ష్మీకళ, భాగ్యలక్ష్మి, షాలీ, శేఖర్‌యాదవ్, శంకర్‌నాయక్, రజిని, నాగమణి, శ్రీలత, ఎంపీటీసీలు శ్రీదేవి, కేతమ్మ, రత్నకుమారి, వనజ, నరేందర్, సుల్తాన్, బాల్‌రెడ్డి, రేణుక, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, విక్రంరెడ్డి, విజయ్‌కుమార్, సురేందర్‌రెడ్డి, వెంకట్రావు, మతీన్, శ్రీనివాస్‌రావు, శేషిరెడ్డి, మణ్యం నాయక్, కృష్ణారావు, శ్రీధర్‌రావు, గోపాల్, రాజాబాబురెడ్డి, మోహన్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసులు శెట్టి పాల్గొన్నారు.