జడ్చర్ల, జనవరి 3 : రాష్ట్రంలో అమలవుతున్న సం క్షేమ పథకాలకు, అభివృద్ధికి ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కా ర్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కా ర్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ గూటికి చేరారు. జడ్చర మున్సిపాలిటీ 5వ వార్డుకు చెందిన 30 మంది కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ నేత కొండల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో తె లంగాణలో ప్రగతి పరుగులు పెడుతున్నదని తెలిపారు. మన పథకాలు ఆదర్శంగా నిలిచాయని స్పష్టం చేశారు. బీజేపీ కిసాన్‌మోర్చా జడ్చర్ల మండల అధ్యక్షుడు మరికంటి సురేందర్, కొప్పులరాజు, వేణుగోపాల్, మల్లేశ్, సాయి, వెంకటేశ్, చందు, గణేశ్, రంజిత్, బీఎస్పీ నా యకులు మధు, ముత్యాలు, రాములు, కాంగ్రెస్‌కు చెం దిన బాబా, హాజీ, మహేందర్ నాయక్ తదితరులు పా ర్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజు, నర్సింహయాదవ్, జగన్, నా యక్, దాసు, రఘు, శ్రీనివాసులు తదితరులున్నారు.
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్..
పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా బీఆర్ఎస్ అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన 20 మంది బీ జేపీ నాయకులు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గులాబీ పార్టీలో చేరారు. హుజురప్ప, రామయ్య, భీమప్ప, హుస్సేన్, వెంకటేశ్, గోవిందు, రాజు, నర్సింహులు, రామాంజనేయులు, శంకరప్ప, కృష్ణతోపాటు పలువురు పార్టీలో చేరిన వారిలో ఉన్నా రు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ శ్రేణుల కు ఏ కష్టమొచ్చినా వెన్నంటే ఉంటామని భరోసా క ల్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్, నాయకులు హనుమంతు, యుగేంధర్‌గౌడ్, వీరన్న, రంగారె డ్డి, వీరేశ్, నాసీర్, రంగస్వామి తదితరులున్నారు.