చిన్నంబావి, సెప్టెంబర్ 6 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టి కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర భుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాలని ఎమ్మెల్యే బీరంహర్షవర్ధన్రెడ్డి అన్నారు. చిన్నంబావి మండల కేంద్రంలో బె క్కెం గ్రామానికి చెందిన 24 మంది దళితులకు భూ పంపిణీ, ఏడాదికి వ్యవసాయ పెట్టుబడి సాయం చెక్కులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కలెక్టర్ షేక్‌యాస్మిన్‌బాషా, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సింగోటం- గోపాల్దిన్నె రిజర్వాయర్ కాలువ పనులకు రెండు నెలల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. చిన్నంబావి మండలంలోని మినీ లిఫ్ట్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. కలెక్టర్ షేక్‌యాస్మిన్‌బాషా మాట్లాడుతూ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందించిన సాయాన్ని సద్వినియోగపరుచుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఎమ్మెల్యే పట్టద ల, కృషితోనే ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు ఎకరాకు రూ.6.5లక్షలు చెల్లించి భూసేకరణ చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆసక్తి గల రైతులు ముందుకు వస్తే భూసేకరణ చేపట్టి మరింత మంది దళితులకు భూ పంపిణీ చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ముగ్గురు లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మంజూరైన రూ.50 వేల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. చిన్నంబావి మండలకేంద్రంలో అతిత్వరలోనే బ్యాంకును ఏర్పాటు చేయడానికి అధికారులతో మాట్లాడినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎంపీపీ సోమేశ్వరమ్మ సమకూర్చిన అంబులెన్స్ వాహనానికి వీపనగండ్ల ఆరోగ్యకేంద్రం నుంచి నిధులు కేటాయించి అందుబాటులో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ వెంకట్రామమ్మ, విండో చైర్మన్ నరసింహారెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి మండల కన్వీనర్ గోవిందుశ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఈదన్నయాదవ్, నాయకులు చిదంబరరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, చిన్నారెడ్డి పాల్గొన్నారు.