శ్రీశైలం, సెప్టెంబర్ 12 : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. సోమవారం జలాశయానికి 2, 95,843 క్యూసెక్కుల వరద వస్తున్నది. డ్యాం తొమ్మిది గేట్లను 10 అడుగుల మేర ఎ త్తి 2,51,847 క్యూసెక్కులను దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీ లు కాగా, ప్రస్తుతం 214.36 టీఎంసీలు ని ల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 885 అ డుగులకుగానూ ప్రస్తుతం 884.80 అడుగులు నమోదైంది.
జూరాలకు భారీగా వరద..
అమరచింత, సెప్టెంబర్ 12 : జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. సోమవా రం సాయంత్రం 2.27 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొ త్తంగా 2,29,274 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
అయిజ, సెప్టెంబర్ 12: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. సో మవారం ఇన్‌ఫ్లో 48,370 క్యూసెక్కులు ఉం డగా, అవుట్‌ఫ్లో 47,900 క్యూసెక్కులు నమోదైంది. ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 470 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 11అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 48,539 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 33,203 క్యూసెక్కులు ఉన్నది.
సుంకేసుల డ్యాంకు..
రాజోళి, సెప్టెంబర్ 12 : మండలంలోని సుంకేసుల డ్యాంకు వరద కొనసాగుతున్నది. 43,567 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 10 గేట్ల నుంచి 41,720 వేల క్యూసెక్కులను దిగువన ఉన్న శ్రీశైలంకు డ్యాంకు వదిలారు. కేసీ కేనల్‌కు 1,847 క్యూసెక్కులు విడుదల చేశారు. డ్యాం దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేట కు వెళ్లొద్దని అధికారులు సూచించారు.