నాగర్‌కర్నూల్, ఆగస్టు 6: జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన నట్టల నివారణ మందు పంపిణీ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి రమేశ్ కోరారు. నాగర్‌కర్నూల్ మండలం మంతటిలో నిర్వహిస్తున్న నట్టల నివారణ శిబిరాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కల్పన, జీవిత, వెటర్నరీ అసిస్టెంట్ శ్రావణి, శివాని, సనా, అరుణ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బిజినేపల్లి మండలంలో..
బిజినేపల్లి, ఆగస్టు 6 : మండలంలోని పాలెం, పోలేపల్లి, మంగనూర్ గ్రామాల్లో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దివ్యభారతి, బుచ్చమ్మ, సర్పంచ్ లావణ్య, రాములు, తిరుపతయ్య, నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
తెలకపల్లి మండలంలో..
తెలకపల్లి, ఆగస్టు 6 : మండలంలోని ఆలేరు, బొప్పల్లి గ్రామాల్లో జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి జీవీ రమేశ్ శుక్రవారం గొర్రెలకు నట్టల నివారణ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 3,209 గొర్రెలు, 279 మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి నాగరాజు, ఎంపీటీసీ ఈశ్వరయ్య, సర్పంచ్ పరశురాం, టీఆర్ఎస్ నాయకుడు రమణ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీపీ విజయ ఆధ్వర్యంలో..
వెల్దండ, ఆగస్టు 6 : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తప్పనిసరిగా వేయించాలని ఎంపీపీ విజయ అన్నారు. మండల పశువైద్యశాఖ ఆధ్వర్యంలో భైరాపూర్, నగరగడ్డ తండాల్లో నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కార్యకమంలో సర్పంచ్ కుమార్, సిబ్బంది నరేశ్‌రెడ్డి, శ్రీనివాస్, నాయకుడు రాజు ఉన్నారు.
కల్వకుర్తి మండలంలో..
కల్వకుర్తి రూరల్, ఆగస్టు 6 : మండలంలోని గుండూర్, మార్చాల, కల్వకుర్తి పట్టణంలోని బాల్రాంనగర్ కాలనీలోని 5,035 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు గుండూర్ పశువైద్యశాల వైద్యుడు శ్రీనాథ్ తెలిపారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది ఆంజనేయులు, ప్రణీత, లక్ష్మి, జంగయ్య, నరేశ్, గోపాలమిత్రలు పాల్గొన్నారు.
చారకొండ మండలంలో..
చారకొండ, ఆగస్టు 6: మండలంలోని జూపల్లిలో మండల పశువైద్యాధికారి యమున ఆధ్వర్యంలో జీవాలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లీశ్వరి, వైస్‌ఎంపీపీ బక్కమ్మయాదవ్, వీఏఎస్ షేక్ మదార్, ఓఎస్ శివరాంనాయక్, రైతులు వెంకటయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు.
వంగూరు మండలంలో..
వంగూరు, ఆగస్టు 6 : మండలంలోని రంగాపూర్, గాజర గ్రామాల్లో మండల పశువైద్యాధికారి అజీత్చంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం 3,500 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో గోపాలమిత్రలు సైదులు, శ్రీనివాస్, నరేశ్, వెంకటయ్యతోపాటు రైతులు పాల్గొన్నారు.
తిమ్మాజిపేటలో మండలంలో..
తిమ్మాజిపేట, ఆగస్టు 6: మండలంలోని 26 గ్రామ పంచాయతీలు, తండాల్లో నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించినట్లు ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచ్ వేణుగోపాల్‌గౌడ్, ఉపసర్పంచ్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
తాడూరు మండలంలో..
తాడూరు, ఆగస్టు 6 : మండలంలోని పాపగల్, భలాన్‌పల్లి గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేసినట్లు పశువైద్యాధికారి రాజేశ్‌కుమార్ తెలిపారు. 5,300 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో భలాన్‌పల్లి సర్పంచ్ అశోక్‌కుమార్, పాపగల్ సర్పంచ్ సువర్ణబచ్చిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, పశువైద్య సిబ్బంది సల్మానాసుల్తానా, మధు, మల్లేశ్, ఆనంద్ తదితరులు ఉన్నారు.