e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జోగులాంబ(గద్వాల్) వాన హోరు..వరద జోరు

వాన హోరు..వరద జోరు

  • జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
  • నారాయణపేటలో 134.0 మి.మీ వర్షపాతం
  • పొంగిపొర్లుతున్న వాగులు..వంకలు
  • నీట మునిగిన కాలనీలు, తండాలు
  • పలు గ్రామాల్లో రాకపోకలకు ఇక్కట్లు

ఊట్కూర్‌, జూలై 16 : నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వానలకు తోడు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి పలు మండలాల్లో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. కురుస్తున్న వర్షానికి ఊట్కూ రు మండలంలోని లక్ష్మీపల్లి చెరువు పూర్తిగా నిండి అలుగు పా రింది. మండలంలోని పెద్ద వాగు వాన నీటితో నిండి పొంగి పొ ర్లింది. భారీ వర్షానికి వల్లంపల్లి గ్రామ సమీపంలో రహదారి క ల్వర్టు కోతకు గురైంది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. చిన్నపొర్ల చెరువు కట్టకు గండి పడడంతో వరద నీరు పత్తి పొలాల్లోకి వెళ్లి భూమి కోతకు గురైంది. దీంతో రైతు లు ఇసుక బస్తాలను అడ్డంగా పేర్చి పొలాల్లోకి వరద నీరు చేరకుండా నిలువరించారు. ఎగువ ప్రాంతం నుంచి వరద రావడంతో ఊట్కూర్‌ పెద్ద చెరువుకు భారీగా వాన నీరు చేరింది. మ రో రెండు పెద్ద వానలు కురిస్తే మండలంలోని అన్ని గ్రామాల చెరువులు అలుగు పారే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నా రు. జిల్లా వ్యాప్తంగా 919.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా నారాయణపేట మండలంలో 134.0 మి.మీ. వర్షం కురిసింది. నర్వ మండలంలో 121.6 మి.మీ, ధన్వాడ మండలంలో 112.0 మి.మీ, మరికల్‌ మండలంలో 105.3 మి.మీ, ఊట్కూర్‌ మం డలంలో 98.2 మి.మీ, దామరగిద్ద మండలంలో 95.7 మి. మీ, మక్తల్‌ మండలంలో 87.0 మి.మీ, మద్దూర్‌ మండలంలో 74.6 మి.మీ, కోస్గి మండలంలో 49.0 మి.మీ, మాగనూర్‌ మండలంలో 28.0 మి.మీ, కృష్ణ మండలంలో 13.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కురుస్తున్న వర్షానికి చెరువులు, కుంట లు, వాగులు, వంకలు నిండుకుండను తలపిస్తుండగా ఇప్పటికే వరి నారు మళ్లను పెంచిన రైతన్నలు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

పెద్ద చెరువుకు గండి
వారం రోజుల నుంచి కురుస్తున్న వానలకు మరికల్‌ పెద్ద చెరువుకు భారీగా వర్షపు నీటితోపాటు కోయిల్‌సాగర్‌ నీరు చేరడంతో శుక్రవారం తెల్లవారుజామున గండి పడింది. మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనుల్లో భాగంగా ఇటీవల నూతనంగా తూము మరమ్మతులు చేపట్టారు. చెరువుకు నీరు అధికంగా రావడంతో తూము వద్ద కట్టకు గండి పడి నీరంతా బయటికీ రావడంతో రహదారి పూర్తి జలమయమైంది. గండి పడిన విషయాన్ని సర్పంచ్‌ గోవర్ధన్‌ నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు, కాంట్రాక్టర్‌ చెరువు గండి పూడ్చారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

నిలిచిపోయిన రాకపోకలు
మండలంలోని కడంపల్లి వాగు వద్ద రోడ్డు కట్ట తెగిపోవడంతో హన్మాన్‌పల్లి కడంపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని ఆరవ వార్డులో ఎర్రకుంట ఇండ్ల మధ్య నీరు చేరడంతో ప్రజలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

నిండిన చెరువులు, వాగులు
మండలంలోని వివిధ గ్రామాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జాజాపూర్‌, కొల్లంపల్లి పెద్ద చెరువు అలుగు పారింది. తిర్మలాపూర్‌, కొల్లంపల్లి శివారులోని కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అలాగే ముసురు, భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. ప్రధాన రోడ్డుపై నీరు నిలిచిపోయాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana