ప్రతి బడినీ అభివృద్ధి చేసుకోవాలి
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్ టౌన్, ఫిబ్రవరి 24 : ప్రతి గ్రామంలో అన్ని సదుపాయాలు కల్పించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంఈవో లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురువా రం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంఆర్సీలు పాల్గొని ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా మక్తల్ ఎమ్మెల్యే హాజరయ్యారు. ‘మన ఊరు-మన బ డి’ కార్యక్రమంపై అధికారులు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో ని పాఠశాలలను బలోపేతం చేయడానికి ‘మన ఊరు-మ న బడి’ కార్యక్రమంతో టీఎస్‌ఈడబ్ల్యూడీసీ ద్వారా ప్రతి పాఠశాలకు మౌలిక వసతులు కల్పించాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పం తో ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మ న్లు, సభ్యులు భాగస్వాములు కావాలన్నారు. ప్లే గ్రౌండ్ లేని పాఠశాలలకు స ర్పంచులు అనుగుణంగా ఉండే స్థలా న్ని కేటాయించాలన్నారు. అందుకు ఎ లాంటి అనుమతులు అవసరం లేదని ఎమ్మెల్యే చెప్పారు. ‘మన ఊరు-మన బడి’ మొదటి విడుత కార్యక్రమంలో భాగంగా మొత్తం 61 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, ఎంపీపీ వనజ, ఎంపీడీవో శ్రీధర్, ము న్సిపల్ చైర్పర్సన్ పావని, అధికారులు పాల్గొన్నారు.
నూతన కమిషనర్‌గా పావని
మున్సిపల్ నూతన కమిషనర్‌గా పావని నియమితులయ్యారు. ఇప్పటికే పావని మండల కార్యాలయంలో ఎం పీడీవోగా బాధ్యతలు నిర్వహిస్తుండగా కమిషనర్‌గా అదన పు బాధ్యతలు స్వీకరించాలని కమిషనరేట్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశాలినట్లు ఆమె తెలిపారు.