మహబూబ్‌నగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కారణంగా విద్యా వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. విద్యా సంస్థలు మూతపడడంతో చ దువులు అటకెక్కాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం, సరైన మొబిలిటీ లేకపోవడంతో ఆన్లైన్ పాఠాలు కూడా వినే పరిస్థితి లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో గ్రామీణ విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తరుణంలో ప్రభు త్వం విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. కరోనా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ నుంచి పీజీ వరకు అన్ని రకాల విద్యాసంస్థలు ప్రారంభించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు పాఠశాలల టీచర్లు, విద్యావ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్న వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యారంగ నిపుణులు సైతం స్వాగతిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఒక్క శాతానికి తగ్గిన నేపథ్యంలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించేందుకు ఇంతకంటే సరైన సమయం లేదని పేర్కొంటున్నారు.
కరోనా తగ్గిన కారణంగానే..
గతంలో కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయం తీసుకున్నది. కరోనా కేసులు పూ ర్తి స్థాయిలో తగ్గి జన సంచారం మామూలు స్థితి కి వస్తున్నది. ఈ క్రమంలో విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్నది. ఇది భవిష్యత్‌పై ప్రభావం చూ పే పరిస్థితి ఉందనే అధ్యయనాన్ని వైద్యశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సెప్టెంబర్ 1 నుంచి వి ద్యా సంస్థలు పునఃప్రారంభించనున్నారు.
తీరనున్న కష్టాలు..
ఆన్లైన్ పాఠాలతో గ్రామీణ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. మారుమూల గ్రామాల్లో సెల్‌ఫోన్ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడంతో పాఠాలు వి నే పరిస్థితి లేక ఇన్నాళ్లు విద్యార్థులు ఇబ్బందులు ప డ్డారు. చాలా మందికి సెల్ఫోన్లు లేకపోవడం కూడా కష్టంగా మారింది. మరికొన్ని చోట్ల ఆన్లైన్ పాఠాల ను పక్కనబెట్టి సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి గడపడంతో అనేక మానసిక రుగ్మతలు తలెత్తినట్లు మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని అభ్యంతరక సైట్లలోనూ కొందరు విద్యార్థులు ఎ క్కువ సమయం గడపడంతో మానసిక పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని ఉపాధ్యాయులు వా పోతున్నారు. ఎక్కువ సమయం సెల్‌ఫోన్ చూడడం తో కంటిచూపుపై ప్రభావం పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అనేక రుగ్మతలకు ఆన్లైన్ పాఠా లు వేదికగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతుండడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు టీచర్లకు ఊపిరి..
గతేడాది మార్చి 24 నుంచి కొవిడ్-19 కారణం గా దేశంలో లాక్డౌన్ విధించారు. అప్పటి నుంచే వి ద్యాసంస్థలు మూతపడ్డాయి. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలో పాఠశాలలు పునఃప్రారంభించినా.. వైరస్ వి జృంభించడంతో మళ్లీ మార్చిలోనే పాఠశాలలకు లాక్ పడింది. దీంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఆన్లైన్ పాఠాలు చెబుతున్నా.. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమకు ఫీజులు రావ డం లేదనే సాకుతో చాలా మంది టీచర్లకు వేతనాలు ఇవ్వడం మానేశారు. ఎక్కువ తరగతులు ఉన్న పాఠశాలలు సైతం ఆన్లైన్లో సబ్జెక్టుకు ఒకే ఉపాధ్యాయుడితో పాఠాలు చెప్పించడంతో మిగతా టీచర్లకు కనీ సం 30 శాతం జీతం కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది పరిస్థితి అగమ్యగోచరం గా మారింది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం నెలకు రూ.2వేలు, 25 కేజీల బియ్యం చొప్పున పంపిణీ చే సి ప్రైవేటు టీచర్లను ఆదుకున్నది. ఇన్నాళ్లు వేధించిన మాయదారి కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం తో తిరిగి పాఠశాలలు ప్రారంభించి సర్కార్ తమనెత్తిన పాలు పోసిందని ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రైవేటు, ప్రభు త్వ పాఠశాలలు కలిపి 4,187 ఉన్నాయి. ఇందులో 5,23,602 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పీయూ పరిధిలో 85 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 33,347 మంది వి ద్యార్థులున్నారు. 15 పీజీ కళాశాలలు, 3 ఎంబీఏ, 4 ఫార్మసీ, 27 బీఈడీ, 2 ఎంఈడీ, 3 బీపీఈడీ కళాశాలలు సైతం పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 5,200 మంది పీజీ వి ద్యార్థులు ఉన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థు లు ప్రత్యక్ష తరగతులకు హాజరు కానున్నారు.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఎంఈవోలు, హెచ్ఎంలకు మార్గదర్శకాలు పంపించాం. పంచాయతీలు, మున్సిపాలిటీలు పాఠశాలల శానిటైజేషన్ చేపట్టనున్నాయి. గ్రామాల్లో టాంటాం వేయిస్తున్నాం. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరిశీలించాలని ఎంఈవోలకు ఆదేశాలిచ్చాం. కలెక్టర్ ఆధ్వర్యంలో పాఠశాలల ప్రారంభంపై ఆన్లైన్లో సమీక్షలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి నేరుగా బడులకు రాని వారికి ఆన్లైన్లో పాఠాలు వినే అవకాశం కల్పిస్తున్నాం. ఈ నెల 30వ తేదీ లోగా శానిటైజేషన్ పూర్తి చేస్తాం. సెప్టెంబర్ 1న ప్రత్యక్ష తరగతులతోపాటు మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రారంభమవుతుంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే పాఠశాలలు ప్రారంభిస్తాం.