పాన్‌గల్, సెప్టెంబర్ 6 : తెలంగాణ ప్రభు త్వం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు చో టుచేసుకున్నాయని, రైతులందరినీ సంఘటి తం చేసేందుకే రైతువేదికలు నిర్మించామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నా రు. మండలకేంద్రంతోపాటు దొండాయిప ల్లి, కేతేపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి రైతు వేదికలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ పాన్‌గల్ రైతు వేదికను తన తల్లిదండ్రు ల జ్ఞాపకార్థంగా సొంత ఖర్చులతో నిర్మించినట్లు తెలిపారు. త్వరలోనే వైజ్ఞానిక శిక్షణతోపాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ నిర్వహిస్తామన్నారు. సంప్రదా య పద్ధతులు, మూస ధోరణిలో పంటలు సాగుచేయొద్దని, ఆదాయం ఎక్కువ వచ్చే ఆ యిల్‌పామ్ తోటలను సాగుచేయాలని కోరా రు. మండలంలోని కొత్తపేటలో 10 వేల మె ట్రిక్ టన్నుల గోదాం నిర్మించినట్లు తెలిపా రు. కిష్టాపూర్ సమీపంలో రామన్నగట్టు మ ధ్యలో త్వరలోనే రిజర్వాయర్ నిర్మాణం మొదలవుతుందన్నారు.
పాన్‌గల్-కేతేపల్లి గ్రామాల్లో ప్రజల సౌకర్యార్థం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణలో ఇండ్లు కో ల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లలో మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎమ్మె ల్యే బీరం మాట్లాడుతూ పెండింగ్ కాల్వలకు మరమ్మతు చేపట్టి సాగునీరు అందిస్తామన్నా రు. కొల్లాపూర్‌లో మామిడి పండ్ల మార్కెట్ ఏర్పాటుకు, వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేయాలని మంత్రిని కోరా రు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కవిత, సింగిల్విం డో చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ మునీరొద్దిన్, నాయకులు వెంకటయ్యనాయుడు, రాముయాదవ్, చంద్రశేఖర్‌నాయక్, జ్యోతినందన్‌రెడ్డి, రవికుమార్, తిరుపతయ్యసాగర్, సర్పంచులు గోపాల్‌రె డ్డి, అనిత, శ్యామలమ్మ, ఎంపీటీసీలు హై మావతి, విజయ్‌భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
దారి చూపుతున్న దళితబంధు..
అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి దారి చూ పేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు అమ లు చేస్తున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వందశాతం సబ్సిడీ కింద 35 మందికి రూ.30వేల చొ ప్పున మంజురైన చెక్కులను జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని, పథకాల అమల్లో దళారుల జోక్యం, పైరవీలకు ప్రమేయం లేకుండా చేశామన్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానం, పీర్లగుట్ట డ్రైనేజీ, సీసీ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ స్టాండ్ నుంచి పాలిటెక్నిక్ కళాశాల మీదుగా వివేకానంద విగ్రహం వరకు రూ.1.7 కోట్ల తో డ్రైనేజీ, పీర్ల గుట్ట వద్ద డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు వెచ్చించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాద వ్, వైస్ చైర్మన్ శ్రీధర్, కౌన్సిలర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, సూపరింటెండెంట్ భానుప్రసాద్ పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ..
సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు మంత్రి నిరంజన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగోటానికి రూ.2లక్షలు, మల్లేశమ్మకు రూ.15 వేలు, నీలమ్మకు రూ.15 వేలు, వరలక్ష్మికి రూ.12,500 చెక్కులు మంజూరయ్యాయన్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకుడు శే ఖర్కు చెందిన రెస్టారెంట్‌ను ప్రారంభించా రు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చంద్రశేఖ ర్, సర్పంచ్ శ్రీనివాసులు, ఉపసర్పంచ్ శివ, గొర్రెల కాపరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షు డు చంద్రయ్య యాదవ్, విండో వైస్ చైర్మన్ రాములు, నాయకులు తిరుపతి యాదవ్, బాలరాజు, మతీన్, కోటీశ్వర్‌రెడ్డి, వెంకటేశ్, గోపాల్, మహేశ్, నాగరాజు పాల్గొన్నారు.