నారాయణపేట టౌన్, ఆగస్టు 23 : మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళల ఆర్థిక అవసరాలు తీర్చడంతోపాటు వారిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రుణాలు ఇస్తున్నది. మహిళలు వ్యాపార రంగంలో రాణించేందుకు వివిధ పథకాల ద్వారా ప్రోత్సాహం అందజేస్తున్నది. ఆయా పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న మహిళలు ఆయా రంగాల్లో వృద్ధి చెందుతున్నారు. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు జీవనోపాధు లు కల్పించడం, ముఖ్యంగా కొత్త వ్యాపారాల్లో అడుగుపెట్టి ఆర్థిక వృద్ధి సాధించడంతోపాటు కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘న్యూ ఎంటర్ప్రైజెస్’ పథకాన్ని తీసుకొచ్చింది. జిల్లాలో ప థకాన్ని అమలు చేసేలా సెర్ప్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పథకంపై అవగాహన కల్పిస్తూ అర్హులైన వారిని గుర్తిస్తున్నారు.
అర్హుల గుర్తింపు…రుణాల మంజూరు..
‘న్యూ ఎంటర్ప్రైజెస్’ పథకం జిల్లాలో మే నెల నుంచి అమలు చేస్తున్నారు. స్త్రీ నిధి, గ్రామ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, మండల మహిళా సమాక్య నిధులే కా కుండా సంఘాలు పొదుపు చేసిన నిధుల (సొంత నిధుల) నుం చి ఈ పథకానికి రుణాలను మంజూరు చేస్తారు. ఆయా నిధుల ను సర్దుబాటు చేసి యూనిట్లకు రుణాలు అందజేస్తున్నారు. స్వ యం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్న ప్రతి మహిళా పథకానికి అర్హురాలు. మహిళకు రుణం ఇచ్చాక వ్యాపారం వృద్ధి చేసుకోగలదా, సకాలంలో రుణాలను తిరిగి చెల్లించగలదా, గ తంలో తీసుకున్న రుణాలు సక్రమంగా, సకాలంలో చెల్లించ్చిం దా.. అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హురాలిని ఎంపిక చేశారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామం లో 3 యూనిట్లకు(ముగ్గురికి) ఈ తరహా రుణాలు ఇవ్వాలని నిర్ణయించి ఆ దిశగా సెర్ప్ అధికారులు చర్యలు చేపడుతున్నా రు. సభ్యురాలు చేపట్టే వ్యాపారాన్ని బట్టి రూ.50 నుంచి 3 లక్ష ల వరకు రుణాలు అందజేస్తున్నారు. తీసుకున్న రుణాలను 36 నెలల నుంచి గరిష్ఠంగా 60 నెలలుగా వాయిదాల రూపంలో సక్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే తీసుకున్న రుణం కేవలం వ్యాపారానికి మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఇతర కార్యాకలాపాలకు వినియోగించరాదు. ఎంపిక చేసిన నూతన యూనిట్ల కు రుణాలు మంజూరు చే స్తే వారు కిరాణం, బ్యూటీపార్లర్, గాజుల దుకాణం, హోటల్, పిండి గిర్ని తదితర వ్యాపారాలను ప్రారంభించవచ్చు. అయితే కొత్తగా వ్యాపా రం పెట్టాలనుకునే వారికే కా కుండా ఇప్పటి వరకే వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి రుణా లు అందజేసి అధికారులు ప్రోత్సాహం అందజేస్తున్నారు. లబ్ధిదారులకు మంజూరైన రుణాలు తమ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు దోహదపడుతున్నాయి.
జిల్లాలో అమలు తీరు…
జిల్లాలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. అందులో మొ త్తం 354 గ్రామ సంఘాలు, 8,407 స్వయం సహాయక సం ఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో మొత్తం 95,117 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 1,114 యూనిట్లకు రుణాలు ఇవ్వాలని గుర్తించారు. అందులో మొత్తం 441 యూనిట్లకు రుణాలు మంజూరు చేయగా 665 యూనిట్లకు రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. మద్దూర్ మండలం లో 198 యూనిట్లకు గుర్తించగా అత్యధికంగా 101 యూనిట్ల కు రుణాలు మంజూరు చేయగా, దామరగిద్ద మండలంలో 15 3 యూనిట్లు గుర్తించగా అత్యల్పంగా 29 యూనిట్లకు రుణాలు అందజేశారు.
జిల్లాలో గుర్తించిన 441 యూనిట్లకుగానూ బ్యాంకు ద్వారా రూ.13,09,5000 రుణాలను, స్త్రీనిధి ద్వారా రూ.36,35, 000 రుణాలను, గ్రామ సంఘాల నిధుల ద్వారా రూ.28, 50,000 రుణాలను, స్వయం సహాయక సంఘాల నిధుల ద్వా రా 6,62,000 రుణాలను, మండల సమాక్య నిధుల ద్వారా రూ.5,80,000 రుణాలను, పొదుపు నిధుల ద్వారా 5,81, 5002 రుణాలను మంజూరు చేశారు.
ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలి…
స్త్రీనిధి, బ్యాంకు ద్వారా అందించే రుణాలు తీసుకు న్న లబ్ధిదారులు తమ జీవన ప్ర మాణాలు మెరుగుపర్చుకోవాలి. మహిళలు వ్యాపారంలో ఆర్థికం గా అభివృద్ధి సాధించేందుకు రు ణాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలు అందజేస్తున్నాం. ఇచ్చిన రుణాలు సద్వినియోగం చేసుకోవాలి.
-ముడావత్ రాము, డీపీఎం నారాయణపేట
ఆదాయ వనరులు పెంపొందించుకోవాలి…
మండలంలో 1,015 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 148 యూనిట్లు ఇవ్వాలని గుర్తించాం. 40 యూనిట్లకు రుణాలు అందజేశాం. మహిళలు తమ ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తీసుకున్న రుణాలు సకాలంలో, సక్రమంగా చెల్లించాలి.
-శకుంతల, ఏపీఎం నారాయణపేట