
అయిజ, సెప్టెంబర్ 30 : ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గురువారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 పడకల అ దనపు భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయిజ మున్సిపాలిటీ, మండల ప్రజలతో పాటు వడ్డేపల్లి, రాజోళి మండలాల వా సులకు అయిజ పీహెచ్సీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడ ప్రసవాలు జరుగుతాయని తెలిపారు. అందుకే అదనపు గదులు నిర్మించేందుకు ప్రభుత్వం కేసీఆర్ కిట్ ఫండ్ కింద సీఎం కేసీఆర్ రూ.80 లక్షలు విడుదల చేశారన్నారు. అయిజను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మేధావులు సలహాలు, సూచనలు అందిస్తే స్వీకరిస్తానన్నారు. అ యిజలో సెంట్రల్ లైటింగ్ సిస్టం అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. డ్రైనేజీలు, సీసీ రహదారుల నిర్మాణాలు చేపడుతున్నామని, త్వరలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అం దుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, వైస్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, విండో చైర్మన్ మ ధుసూదన్రెడ్డి, డీఈ రాఘవన్, ఏఈ అబ్దుల్ రహీం, డా క్టర్లు సయ్యద్ ఇర్షాద్, స్వరూపారాణి, మాజీ ఎంపీపీ సుం దర్రాజు, విండో మాజీ చైర్మన్ రాముడు, కౌన్సిలర్లు అని త, నర్సింహులు, వెంకటేశ్, రాణెమ్మ, ఆంజనేయులు, నా యకులు రఘునాథ్‌రెడ్డి, మహబూబ్‌బాషా, రమేశ్, నర్సింహారెడ్డి, ప్రహ్లాదరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.