
కృష్ణ, ఆగస్టు 26 : దివంగత, మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి జయంతి వేడుకలు కృష్ణ, మాగనూర్ మండలాల టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం మండలంలోని గుడెబల్లూర్ పంచాయతీ టైరోడ్ వద్ద ఏర్పా టు చేసిన జయంతి వేడుకలకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ హాజరై నర్సిరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం కూడా అంతే ముఖ్యమని, నమ్మిన ప్రజా నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి అని పేర్కొన్నారు. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ని ర్వహించారు. కార్యక్రమంలో డీసీసీడీ చైర్మన్ నిజాంపాషా, మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, ఎంపీపీ పూర్ణిమ, జెడ్పీటీసీ అంజనమ్మ, టీఆర్ఎస్ కృష్ణ, మాగనూర్ మండలా ల అధ్యక్షులు విజయప్పగౌడ్, ఎల్లారెడ్డి, స ర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శివ ప్ప, సర్పంచ్ మహదేవమ్మ, సింగల్‌విండో డై రెక్టర్లు, నాయకులు, చిట్టెం కుటుంబ సభ్యుల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
‘నర్సిరెడ్డి ఆశయ సాధనకు కృషి చేద్దాం’
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పరితపించిన ది వంగత, మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి ఆశ య సాధనకు కలిసి కట్టుగా కృషి చేద్దామని జె డ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. చిట్టెం నర్సిరెడ్డి జయంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘ నంగా నివాళులర్పించారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సేవలందించారని నా యకులు కొనియాడారు.
ఆయన తనయుడు, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నా యకత్వంలో బంగారు తెలంగాణ సాధనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మ న్ బాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, విండో మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీ సీ అరవింద్‌కుమార్, ఎంపీటీసీ రవిప్రసాద్‌రెడ్డి, ఉప సర్పం చ్ ఇబాదుల్ రహిమాన్, మండల కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహిమాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, శివరామరాజు, పట్టణ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.