
హన్వాడ, జూలై 27 : రాష్ట్రంలోని పేదల కడుపు నిం పేందుకే కొత్త రేషన్ కార్డులను అందజేస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవా రం మండల కేంద్రంలో 79 మంది లబ్ధిదారులకు రేష న్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే హరితవనంలో మొక్కలు నాటారు. జన్ సాహస్ స్వచ్ఛంద సం స్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను అందించడంతోపాటు రూ.6 లక్షలతో నిర్మించనున్న అదనపు గది నిర్మాణానికి కలెక్టర్ వెంకట్రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల్లో 4 వేల కొత్త రేషన్ కార్డులు అందించినట్లు తెలిపారు. రేషన్ డీలర్లు లబ్ధిదారులకు అందుబాటులో ఉం టూ సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. సరుకులు పక్కదారి పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే కొత్త ఆసరా పింఛన్లు అందనున్నాయని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అ హర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు.
గత ప్రభుత్వాలు ఇంత అభివృద్ధి చేశాయా.. ప్రజలు ఆలోచించాలన్నారు. రూ.కోటీ 20 లక్షలతో మటన్ మార్కెట్, రూ.65 లక్షలతో రైతు మార్కెట్, రూ.20 లక్షలతో ఓపెన్ జిమ్ సెం టర్ మంజూరై నెలలు గడుస్తున్నా పనుల్లో వేగం పెర గడం లేదన్నారు. మార్కెట్ యార్డు పనులు త్వరగా పూ ర్తి చేసి మోడల్‌గా నిలుపాలని అధికారులను మంత్రి ఆ దేశించారు. హేమసముద్రం చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం దళిత సాధికారత పథకాన్ని అమలు చేస్తున్న సందర్భంగా టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జంబులయ్య ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్‌రాజ్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంఈవో రాజునాయక్, పార్టీ అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, సర్పంచ్ రేవతి, విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
పోచమ్మ తల్లికి పట్టువస్ర్తాలు సమర్పణ..
పాలమూరులో బో నాలు బైలెల్లాయి. మంగళవారం జిల్లా కేంద్రంలోని న్యూగంజ్, పాతపాలమూరు, కోయిల్‌కొండ, ఎక్స్రోడ్డుతోపాటు పలు ప్రాంతాల్లోని ప్రజలు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బోనాలతో మహిళలు ఊరేగింపుగా పోచమ్మ అమ్మవారి ఆలయాలకు చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వర కు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నా రు. పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేశారు. రవీంద్రనగర్‌లోని పోచమ్మ అ మ్మవారికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పట్టువస్ర్తా లు సమర్పించారు. మంత్రి సతీమణి శారద బోనమెత్తా రు. ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు వేలాదిగా ఆలయాలకు చేరుకున్నారు. కార్యక్రమాల్లో పెద్ద నర్సింహ, పడాకుల రమేశ్, మడుగు నాగరాజు, శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు.