నారాయణపేట రూరల్, ఆగస్టు 7 : పేట చేనేత చీరలకు జాతీయస్థాయిలో మంచి ఆదరణ, గుర్తింపు ఉం దని, ప్రత్యేక గుర్తింపు కోసం లయన్స్ క్లబ్ తరపున త మవంతు కృషి చేస్తామని హైదరాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సంగీతవర్మ, కవితరాథోడ్, కవి త విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని అశోక్‌నగర్ పేట లయన్స్ క్లబ్ భవనంలో గౌరంగి కార్యక్రమంలో భాగంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయిలో పేట చేనేత చీరలకు మంచి ప్రజాదరణ పొందడం జరిగిందన్నారు. పేట చేనేత చీరల ప్రత్యేకత ను దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం కేసీఆర్ సతీమణి పేట చేనేతకారులు నేసిన చీరల ప ని తీరును అభినందించారన్నారు. అనంతరం గాంధీనగర్‌కు చెందిన చేనేత కార్మికురాలు కస్తూరికి నూత న మగ్గం ఏర్పాటు చేసుకొనేందుకు రూ.35 వేల నగదును అందజేశారు. లయన్స్ క్లబ్ వారు చేనేత కార్మికులను, పేట లయన్స్ క్లబ్ వారిని జ్ఞాపికలను అం దించి సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వై స్ గవర్నర్ హరి నారాయణ భట్టడ్, క్లబ్ అధ్యక్షుడు జ గదీశ్, కోశాధికారి జనార్దన్, సభ్యులు పాల్గొన్నారు.