ఆత్మకూరు/అమరచింత, సెప్టెంబర్ 6 : ఎగువన కు రుస్తున్న వర్షాలకు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్న ది. దీంతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. ఆదివారం రాత్రి వరకు 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో న మోదుకాగా.. సోమవారం తెల్లవారుజామున 72 వేల క్యూసెక్కులకు చేరింది. ఉదయం 9 గంటల వరకు 1.03 లక్షల క్యూసెక్కులు నమోదుకాగా.. రాత్రి 9 గం టలకు 1,21,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 20 గేట్లను మీటర్ మేర ఎత్తి 1,20,564 క్యూసెక్కు లు దిగువకు వదిలారు. విద్యుదుత్పత్తికి 28,069, ఎడమ కాలువకు 640, కుడి కాలువకు 640, సమాంతర కాలువకు 150, భీమా-2కు 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.300 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నుంచి 1,50,110 క్యూసెక్కు ల ఔట్‌ఫ్లో నమోదైంది. వరద పెరగడంతో ఎగువ జూ రాలలో ఐదు, దిగువ జూరాలలో 6 యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి నిర్వహిస్తున్నారు. ఎగువ జూరాలలో సో మవారం 2.90 మి.యూ. ఉత్పత్తి జరగగా, ఇప్పటివరకు 136.626 మి.యూ. ఉత్పత్తి చేశారు. దిగువ జూ రాలలో సోమవారం 2.90 మి.యూ. ఉత్పత్తి జరగగా, మొత్తం 147.316 మి.యూ. విద్యుదుత్పత్తి చేశారు.
టీబీ డ్యాంకు వరద ..
అయిజ, సెప్టెంబర్ 6 : కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న మోస్తరు వర్షాలకు టీబీ డ్యాంకు వరద చేరుతున్నది. సోమవారం 12,824 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో, 17,130 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదైంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100.624 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టకు 22,484 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 22,050 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నట్లు ఏఈ డేవిడ్ పేర్కొన్నారు. ప్ర స్తుతం ఆనకట్టలో 8.7 అడుగుల మేర నీటి మట్టం ఉందని, ప్రధానకాల్వకు 434 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
శ్రీశైలం @ 873.90 అడుగులు..
ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరుగుతున్నది. సోమవారం రాత్రి జూ రాల నుంచి 1,20,568, విద్యుదుత్పత్తి నుంచి 28,749, సుంకేసుల నుంచి 12,831 క్యూసెక్కులు.. మొత్తం 1,62,148 క్యూసెక్కుల నీరు విడుదలైంది. కాగా, రాత్రి 9 గంటల వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు 57,081 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఎడమగట్టు విద్యుదుత్పత్తి ద్వారా 34,255 క్యూసెక్కులను సాగర్‌కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమ ట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 873.90 అడుగుల వద్ద నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కోయిల్‌సాగర్‌కు వరద..
కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3 వేల క్యూసెక్కులు చేరుతుండడంతో నాలుగు గేట్ల ద్వారా దిగువకు 3,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ఈఈ ప్రతాప్‌సింగ్ తెలిపారు. ప్రాజెక్టులో 32.5 అడుగుల (2.25 టీఎంసీలు) వద్ద నీటి నిల్వ ఉన్నందున వరద ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటిని వదులుతున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 32.6 అడుగులు (2.27 టీఎంసీలు) అని తెలిపారు.