ఉదండాపూర్, కరివెన రిజర్వాయర్ల సందర్శన
జడ్చర్ల టౌన్/భూత్పూరు, ఫిబ్రవరి 24 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ శివారులో, భూత్పూ రు మండలంలో నిర్మాణంలో ఉన్న కరివెన రిజర్వాయర్లను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ సందర్శించింది. గురువారం రెండు రిజర్వాయర్ల వద్దకు చేరుకున్న ఎన్జీటీ నియమించిన కమిటీ బండ్లను పరిశీలించింది. అనంతరం ఉదండాపూర్‌లో కలెక్టర్ వెంకట్రావుతో క లిసి రిజర్వాయర్ వద్ద ఉన్న క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆ తర్వాత రిజర్వాయర్ పంప్‌హౌస్, టన్నెల్లోకి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించారు. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కరివెన 13, 14, 15వ ప్యాకేజీ పరిధిలోని పనులను పరిశీలించారు. ఐఆర్వో సైంటిస్ట్ డాక్టర్ ఆరోకియా లెని న్ కరివెన ప్రాజెక్టు పనులను ఎప్పటి నుంచి నిలిపివేశారని, అక్కడ ఉన్న కొందరిని అడిగి తెలుసుకున్నారు. రెండు నెలలుగా నిలిపివేసినట్లు అక్కడి వారు సమాధా నం చెప్పారు. సందర్శించిన వారిలో కమిటీకి చెందిన హైదరాబాద్‌కు చెందిన లెనిన్, చెన్నైకి చెందిన సీపీసీబీ, ఐఆర్వో సైంటిస్ట్ పూర్ణిమా, మహబూబ్‌నగర్ మైన్స్, జువాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్, హైదరాబాద్ జోనల్ సెంటర్ సైంటిస్ట్ మేఘనాథన్, సీడబ్ల్యూసీ కేజీబీవో డైరెక్టర్ రమేశ్‌కుమార్, కేఆర్ఎంబీ సభ్యుడు ఎల్బీ మౌంథగ్ ఉన్నారు.