
బాలానగర్, అక్టోబర్ 1 : టీఆర్ఎస్ పా ర్టీ నూతన కమిటీల సభ్యులు పార్టీని మ రింత బలోపేతం చేసేందుకు కృషి చేయాల ని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్ అన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో ఎన్నికైన టీఆర్ఎస్ మండల, అనుబంధ కమిటీల వివరాలను శుక్రవారం మండలకేంద్రంలో వెల్లడించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా కర్ణం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా కళ్లెం శ్రీను, సోమ్లానాయ క్, వస్పుల శేఖర్, ప్రధాన కార్యదర్శిగా గుం డేడ్ చెన్నారెడ్డి, అధికార ప్రతినిధిగా అరుణ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాలునాయక్, యూత్వింగ్ మండల అధ్యక్షుడిగా సుప్ప ప్రకాశ్, ఉపాధ్యక్షులుగా కృష్ణ, నరేందర్, ప్రధానకార్యదర్శిగా రవినాయక్, బీసీసెల్ మండల అధ్యక్షుడిగా రమేశ్, ఉపాధ్యక్షులుగా దివాకర్, కృష్ణయ్య, రవికుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాధవి, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మి, సోషల్ మీడియా కన్వీనర్‌గా సంతోష్‌కుమార్, ఉపాధ్యక్షులు గా మొల్గర శ్రీకాంత్, రాంచందర్, ఎస్టీసెల్ అధ్యక్షుడిగా బాసునాయక్, ఉపాధ్యక్షులుగా రమేశ్‌నాయక్, లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా లచ్చిరాంనాయక్, రైతు కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా బాలరాజుయాదవ్, భూపాల్‌రెడ్డి, కార్మిక విభాగం అధ్యక్షుడిగా రెడ్యానాయక్, ఉపాధ్యక్షులుగా భాస్కర్, జగదీశ్వర్‌గౌడ్, మైనార్టీసెల్ అధ్యక్షుడిగా ఎండీ జమీరుల్లా, ఉపాధ్యక్షులుగా హబీబ్, మునాఫ్, ఖాజాపాషా, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా నిరంజన్‌గౌడ్, ఉ పాధ్యక్షులుగా రామస్వామి, చక్రంచారి, కిషన్‌నాయక్ తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు. కాగా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడి గా మూడోసారి తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కర్ణం శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మండలంలో యువతను ఏకం చేసి టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా మారుస్తానని యూత్వింగ్ మం డల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్ తెలిపారు. తనపై నమ్మకంతో మూడోసారి యూత్వింగ్ మండల అధ్యక్షుడి బాధ్యత అప్పగించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ వెంకటాచారి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటయ్య ఉన్నారు.