
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 12: అడ్డాకుల పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకరిస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆలతోపాటు స్నేహ చికెన్ పరిశ్రమల అధినేత రాంరెడ్డి అడ్డాకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు పాఠశాలలో నెలకొన్న సమస్యలను, తరగతిగదులు లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే ఆల పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి రూ.25లక్షల వరకు సహకారం అందిస్తానన్నారు. అదేవిధంగా స్నేహ చికెన్ పరిశ్రమ అధినేత రాంరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న నాలుగు తరగతి గదులకు అయ్యే ఖర్చును సొంతంగా పూర్తి చేయిస్తామని చెప్పారు. జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో ఏడు గదుల నిర్మాణానికి తన నిధులతో నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలతోపాటు, రాంరెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, స్నేహ పరిశ్రమ ప్రతినిధి రామేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ మంజులభీమన్నయాదవ్, రమేష్‌గౌడ్, ఎంపీటీసీ రంగన్నగౌడ్, నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆలకు కృతజ్ఞతలు
మండలంలోని పాతమొల్గరలో గురువారం జరిగి న ఓ వివాహానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం తిరిగి వస్తుండగా మండలంలోని గోప్లాపూర్‌లో దేవమ్మ అనే వృద్ధురాలు నేరుగా ఎమ్మెల్యే ఆల కారును ఆపి కల్యాణలక్ష్మి దరఖాస్తుపై సంతకం చేయించుకున్నది. ఎమ్మెల్యే రోడ్డుపైనే సంతకం చేయడంతో వృద్ధురాలు ఎమ్మెల్యే ఆలకు కృతజ్ఞతలు తెలిపింది.