
ఊట్కూర్, ఆగస్టు 1 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ ప్రణాళికతో పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపడింది. గ్రామాల్లో సంబంధిత శాఖల అధికారులు, ప్రత్యే కాధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల భాగస్వామ్యం తో పల్లెలన్నీ పరిశుభ్రంగా మారి అభివృద్ధిలో ముందడుగు వేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేసిన నాటి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు మారుమూల గ్రామాలు, తండాల్లో పర్యటించి ప్రజలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రణాళికలో పొందుపరుచుకున్నారు. గుర్తించిన ప నులను పల్లె ప్రగతిలో భాగంగా పరిష్కరించి గ్రామాలను స్వచ్ఛత వైపు పయనించేలా కృషి చేశారు. గ్రామాల్లో మురు గు కాల్వలను శుభ్రం చేయడం, ప్రధాన రహదారులు, అం తర్గత రోడ్లకు ఇరు వైపులా చెత్తాచెదారం, ముళ్ల పొదలను తొలగించి శుభ్రం చేశారు.
మండల వ్యాప్తంగా శిథిలావస్థ కు చేరిన ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను గుర్తించి అందులో ముళ్ల పొదలను తొలగించారు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న పురాతన బావులను మట్టితో పూర్తిగా పూడ్చి వేశారు. మురుగు నీటి గుంతలు ఉన్న ప్రాంతాలను గు ర్తించి గుంతల్లో బ్లీచింగ్ చల్లించి పారిశుధ్య చర్యలు చేపట్టారు. మండలంలో ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్సెంటర్లను గుర్తించి అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పారిశుధ్య చర్యలు చేపట్టారు. అధికారులు గ్రామాల్లో పల్లె నిద్ర చేపట్టి ప్రజా సమస్యలను అక్కడి కక్కడే పరిష్కరించారు.
హరితహారంలో 1.17 లక్షల మొక్కల సంరక్షణ..
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 7వ విడుత హరితహారం ద్వారా మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో 1.17 లక్షల మొక్కలు నాటారు. మండల వ్యాప్తంగా 2. 48 లక్ష మొక్కలు నాటేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. మండలకేంద్రంలో 11 వేల మొక్కలను నాటి టార్గెట్ను పూర్తి చేశారు. మండల ప్రత్యేకాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఈజీఎస్ సిబ్బంది హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి విజయం సాధించారు. ఒక పక్క పల్లెప్రగతి ద్వారా సమస్యలను గుర్తిస్తూనే మరో పక్క ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హరితహారంలో భా గంగా మొక్కలు నాటుతూ ప్రజల్లో చైతన్యం నింపారు. అదేవిధంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పలు గ్రామా ల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటి హరితహారం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.
తడి, పొడి చెత్తపై అవగాహన..
మండలంలో పారిశుధ్య చర్యల్లో భాగంగా తడి, పొడి చెత్తపై ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు. అందులో భాగంగా గ్రామంలో ప్రజలకు చెత్త వేసే విధానం, తడి, పొడి చెత్తను ఎలా వేరు చేయాలి, దాని వల్ల కలిగే లాభాలు, అనర్థాలను ప్రజలకు వివరిస్తూ వారిలో చైతన్యం కల్పించారు. గ్రామాల్లో మురుగు నీటి కాల్వల్లో నిల్వ ఉన్న పూడికతీతను గుర్తించి పల్లె ప్రగతిలో తీయించారు. ఈప్రణాళిక ద్వారా ఏండ్ల తరబడి పేరుకుపోయిన పారిశుధ్యం సైతం ప్రస్తుతం మెరుగుపడిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి గ్రామం స్వచ్ఛత పాటించాలి
ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్ఛతను పాటించాలి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘పల్లెప్రగతి’ ద్వారా గ్రామాలు పారిశుధ్య రహిత గ్రామాలుగా విలసిల్లుతున్నాయి. దీనిని అలాగే కొనసాగించేందుకు ప్రజలు తమవంతు బాధ్యత తీసుకోవాలి. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డ్రైనేజీలలో పూడికను తొలగించి బ్లీచింగ్ చల్లించుకోవాలి. ఇలా చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు గన్న స్వచ్ఛ తెలంగాణ సాధ్యమవుతున్నది.