
ధన్వాడ, సెప్టెంబర్ 30 : పరిసరాలను శుభ్రంగా ఉం చండి…త్వరలోనే హాస్టల్స్ ప్రారంభమవుతాయి… విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ హరిచందన కోరారు. గురువారం ధన్వాడ, మందిపల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. ధన్వాడలో పూర్తయి న గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. ప్రతి గది లో నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అనంతరం పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. హాస్టల్ ఆవరణలో మంచి మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించా రు. చిన్న మొక్కలు ఏర్పాటు చేయిస్తే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. మందిపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని సం దర్శించి మొక్కలను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అమరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ గోవర్ధన్‌గౌడ్, ఎంపీడీవో, డిప్యూటీ తాసిల్దార్, ఎంపీఈవోతో పాటుగా పలువురు పాల్గొన్నారు.
రైతులు పంట మార్పిడి చేయాలి
రైతులు ప్రతిసారి ఒకే పంట సాగు చేయకుండా మార్పిడి చేపట్టాలని కలెక్టర్ హరిచందన కోరారు. ధన్వాడ సింగిల్‌విండో కార్యాలయంలో చైర్మన్ వెంకట్రామ్రెడ్డి అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. సభకు కలెక్టర్ హాజరై రైతులతో మాట్లాడారు. అం దరూ ఒకే పంట వేయడం వల్ల ధర రావడం లేదని, ప్రధానంగా వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని సూచించారు. అందుకు ప్రభు త్వం ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు. విండో పరిధిలో కొత్త గోదాము నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ విండో చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, డైరెక్టర్లు కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో సర్పంచ్ అమరేందర్‌రెడ్డి, డైరెక్టర్లు, స భ్యులు, రైతులు పాల్గొన్నారు.
లాభదాయకమైన వ్యాపారాలు చేయాలి
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 30 : మహిళా సం ఘాల సభ్యులందరూ ఒకే విధమైన వ్యాపారాలు నిర్వహించకుండా, వివిధ రకాల జీవనోపాధులను ఎంచుకొని లాభదాయకమైన వ్యాపారాలు చేయాలని కలెక్టర్ హరిచందన అన్నారు.
జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ మం డలాల మహిళా సంఘాల పనితీరును సమీక్షించారు. మరికల్ మండలంలో ఏర్పాటు చేసిన సూపర్‌మార్కెట్, ధన్వా డ మండలంలోని సీహెచ్‌సీ సెంటర్, పేట పట్టణంలో నిర్వహిస్తున్న రూరల్ మార్ట్‌కు సంబంధించి నిర్వహణ, ఆదా య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమా ఖ్య సభ్యులు సమావేశానికి మొదటి సారిగా హాజరైన కలెక్టర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్డీవో గోపాల్‌నాయక్, డీపీఎంలు ఆనందం, దామోదర్, మండలాల ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.