ప్రారంభమైన పోలేపల్లి ఎల్లమ్మ జాతర
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు
తరలివచ్చిన నాలుగు రాష్టాల భక్తులు
ఏర్పాట్లను పరిశీలించిన సీఐ
కోస్గి, ఫిబ్రవరి 24 : కొలిచే భక్తుల కోర్కెలు తీర్చే తల్లి పోలేపల్లి ఎల్లమ్మ. ఉత్సవంలో సిడె ప్రధాన ఘట్టం శుక్రవా రం నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినానికి ముందు అమ్మవారి జాతర నిర్వహిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట ప్రజలు పెద్ద ఎత్తున ఉ త్సవాలకు హాజరవుతారు. ఆర్టీసీ అధికారులు పెద్ద మొత్తం లో బస్సులు నడుపుతున్నారు. ఆలయ అధికారులు సైతం అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో పోలీసులు పటిష్ట బందో బస్తును ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను సీఐ జనార్దన్ పరిశీ లించారు.
సిడె ప్రధాన ఘట్టం
తొట్లెలో అమ్మవారి మూలవిరాట్ను ఉం చి ఆలయం చుట్టూ రథాన్ని ఐదు ప్రదక్షిణ లు తిప్పుతుంటే భక్తులు గవ్వల బండారు చల్లుతూ దర్శించుకుంటారు. ఈ ప్రధాన ఘ ట్టాన్నే సిడె ఘట్టం అని పిలుస్తారు. గవ్వలు, పసుపు కలిపిన గవ్వల బండారును అమ్మవారికి సమర్పిస్తే కోర్కెలు తీరుతాయని భక్తు ల నమ్మకం. ఘట్టాన్ని తిలకించేందుకు భక్తు లు, ప్రజలు పెద్దఎత్తున తండోప తండాలు గా బారులుదీరుతారు. ఆలయ అధికారులు సైతం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జాతరలో వెలిసిన దుకాణాలు
జాతరలో ప్రజల సౌకర్యార్థం అన్ని రకా ల షాపులు వెలిశాయి. చిన్నారులకు ఆహ్లాదాన్నిచ్చే రంగుల రాట్నం వంటి ఎన్నో రకరకాల షాపులు ఇక్కడ వెలిశాయి.