నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : పంటల ఉత్పత్తిలో, కొనుగోళ్లలో, రైతులకు ఉచిత క రెంట్ ఇవ్వడంలో రాష్ట్రం నెంబర్‌వన్ స్థానంలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపా రు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీ కారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్న టీఆర్ఎస్ ప్ర భుత్వం, సీఎం కేసీఆర్‌పై ఉద్యమంలో పాల్గొనని పా ర్టీలు, నాయకులు విమర్శిస్తే సహించమని హెచ్చరించా రు. టీఆర్ఎస్ సర్కారును విమర్శిస్తే కర్రుకాల్చి వాత పె డతామంటూ ధ్వజమెత్తారు. ఉద్యమకారులందరికీ పదవులు దక్కాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి అయితే నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ వంటి రిజర్వాయర్లతో ఉమ్మడి పాలమూ రు జిల్లాలో 75 నుంచి 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మూడేండ్లలో ‘పాలమూరు’ పూర్తి చేస్తామన్నారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి మూడు దశాబ్దాలు పడితే.. మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ను పూర్తి చేసుకున్నామన్నారు. దీని తొలి దశలోనే 40లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టులో ఇప్పటి వరకు రూ.70వేల కోట్లు ఖర్చయితే లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ప్ర చారం చేయడమేంటని.., వాళ్లది నోరేనా..? అని ప్ర శ్నించారు. నాడు భూములన్నీ వయ్యారి భామ, లొట్టపీసు, ముళ్ల కంపలతో నిండిపోయేవని, నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయన్నారు.
వ్యవసాయం తో 60 శాతం మందికి లబ్ధి కలుగుతుంటే.. అనుబంధంగా గొర్రెలు, చేపల పెంపకం వంటి కుల, చేతి వృత్తు ల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దీన్ని కూడా ప్రతిపక్షాలు తప్పుబట్టడం హేయమన్నారు. అభివృద్ధిలో ఆంధ్రాను మించిపోయిందన్నారు. దీనంతటికీ సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలే కారణమన్నారు. ఇలా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర పోషించని పార్టీలు, నాయకులు సీఎంపై, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్న ఉద్దేశంతో కొత్తగా మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొల్లాపూర్ చౌరస్తాకు దివంగత మంత్రి మహేంద్రనాథ్ పేరు పెట్టడం సంతోషకరమన్నారు. మార్కెట్ యార్డులోని సమస్యల పరిష్కారానికి తన వంతు సహకరిస్తానన్నారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు పెట్టిన చరిత్ర సీఎం కేసీఆర్‌దే అని అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా పెబ్బేర్ మార్కెట్ చైర్‌పర్సన్‌గా పీజీ చదివిన ఎస్టీ మహిళను నియమించామన్నారు. ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ రైతులకు సేవలందించడంలో మార్కెట్ కమిటీ ముందుండాలన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పండుగలా సాగుతుందన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ మార్కెట్ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. కవి, గాయకుడు సాయిచంద్ ఆటపాట అలరించాయి. అంతకు ముందు జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు, మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారిణి బాలమణెమ్మ ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా గంగనమోని కురుమయ్య, ఉపాధ్యక్షుడిగా జైపాల్‌రెడ్డి, కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతరావు, డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్ రెఢ్డి, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.