ఇంఫాల్, ఫిబ్రవరి 4: మణిపూర్ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు వై ఖేమ్‌చంద్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. 62 ఏండ్ల బీజేపీ శాసనసభ్యుడైన ఖేమ్‌చంద్ చేత గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రులుగా కుకీ తెగకు చెందిన ఎమ్మెల్యే ఏ నేంచా కిన్జెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ఎల్ దిఖో కూడా ప్రమాణం చేశారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే గోవిందాస్ కొంతౌజమ్, ఎన్పీపీకి చెందిన కే లోకేన్ సింగ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఢిల్లీలోని మణిపూర్ భవన్ నుంచి వర్చువల్ పద్ధతిలో కిన్జెన్ ప్రమాణం చేశారు. అంతకుముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఇక్కడి లోక్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. 2023 మే 3 నుంచి జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ హింసాత్మకంగా మారింది.