వనపర్తి దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో సేవలందాలి
సమస్యలుంటే దృష్టికి తీసుకురావాలి
అన్ని హంగులతో రూపుదిద్దుకుంటున్న మినీ ట్యాంక్‌బండ్
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి రూరల్, ఫిబ్రవరి 24 : వనపర్తి జిల్లా కేం ద్రంలోని దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వసతులు కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం జిల్లా ప్రభుత్వ దవాఖానను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డుల్లో తిరుగుతూ రోగుల ఆరోగ్య పరిస్థితులను, వసతులను అడిగి తెలుసుకున్నారు. రాజపే ట గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితుల గు రించి దవాఖాన సూపరింటెండెంట్ రాజుకుమార్‌ను అ డిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని ఆదేశించారు. పరిసరాలు శు భ్రంగా ఉంచాలని, వీటితోనే ఇక్కడికొచ్చే వారికి సగం రోగం తగ్గాలని సూచించారు. ఏరియా దవాఖాన నుం చి జిల్లా దవాఖానగా మారిన పరిస్థితుల్లో మరిన్ని వ సతులను కల్పించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఉస్మాన్, నాగవరం వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, వేణురెడ్డి, మాధవ్‌రెడ్డి, ప్రేమనాథ్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
మినీట్యాంక్‌బండ్‌గా తాళ్ల చెరువు..
వనపర్తి, ఫిబ్రవరి 24 : జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్‌నగర్‌లో ఉన్న తాళ్ల చెరువు మినీ ట్యాంక్ బండ్‌గా రూపుదిద్దుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక నాయకులతో కలిసి మంత్రి చెరువు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాళ్ల చెరువు గతంలో ముళ్లపొదలతో దట్టంగా ఉండేదన్నారు. ఎవరు కూడా అటు వైపు వెళ్లేందుకు ఇష్టపడేవారు కాదన్నారు. మినీ ట్యాంక్‌బండ్ రూపకల్పనతో అన్ని హంగులు సంతరించుకోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చన్నారు.
క్రీడల్లో రాణించాలి..
నేటి యువత చెడుదారుల వైపు వెళ్లకుండా విద్యా, క్రీడారంగాల్లో రాణించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టు క్రీడాకారులను క్యాంపు కార్యాలయంలో అభినందించారు. క్రీడారంగంలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు సత్యం, మ హేశ్, నారాయణ, టీఆర్ఎస్ పట్టణ సోషల్ మీడియా అధ్యక్షుడు మాధవరావు, సునీల్, వాల్మీకి, అస్లాం, రఫీ క్, జబ్బార్ తదితరులు ఉన్నారు.