
మల్దకల్, అక్టోబర్ 18 : తన భూమిని ఇతరులకు ప ట్టా చేశారని, తనపై పట్టా మార్చాలని బాధితురాలు తాసిల్దార్ కార్యాలయం గే టుకు తాళం వేసిన ఘటన మండలకేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం చోటుచేసుకున్నది.. బాధితురాలి కథనం మేర కు.. మండలకేంద్రానికి చెం దిన మహిళా రైతు వెంకటేశ్వరమ్మ సర్వే నంబర్ 131లో 30గుంటల భూమిని రెవె న్యూ అధికారులు ఇటీవల ఇతరులపై పట్టాచేశారని తెలిపింది. తన పేరున ఉన్న భూ మిని ఇతరులకు ఎలా మార్చారని తాసిల్దార్ను నిలదీసింది. తాను లేకుండా ఎలా ప ట్టా చేశారో.. ఇప్పుడు తన పేరున కూడా పట్టాచేయాలని డిమాండ్ చేసింది. ఉన్న 30 గంటల్లో కాస్తు చేస్తున్నామని, తాము ఎక్కడికి వెళ్లాలని రోధిస్త్తూ అధికారులను కో రింది. కాగా, అధికారులు కోర్టు ఉత్తర్వులు వచ్చాయని, వాటిని అనుసరించి పట్టా చే శామని చెబుతున్నట్లు వాపోయింది. అయితే కోర్టు ద్వారా తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వెంకటేశ్వరమ్మ వాపోయింది. ఎలాంటి నోటీసులు రాకుండా తన పేరున ఉన్న భూమిని ఇతరులకు ఎలా పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పట్టా చేసే వరకు తాళం తీసే ప్రసక్తే లేదని తెలుపడంతో తాసిల్దార్ పోలీసులను పిలిపించి తాళం తీయించారు. పోలీసుల సమక్షంలో తాసిల్దార్ భూమి వివరాలను సేకరించారు. అనంతరం తాసిల్దార్ అజంఅలీ మాట్లాడుతూ.. సర్వే నంబర్ 131లోని భూవివాదం కలెక్టర్ కార్యాలయం, కోర్టులో ఉందని తెలిపారు. ఇటీవల ట్రిబ్యునల్ ద్వారా ఉత్తర్వు లు ఆంజనేయులు అనే రైతుకు మార్పిడి చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. దీంతో వారు స్లాట్ బుక్ చేసుకోవడంతో కోర్టు మాడిల్ అనుసరించి పట్టా చేశామన్నారు. అయితే ఇప్పుడు మహిళా రైతు వెంకటేశ్వరమ్మ వచ్చి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపిందన్నారు. రికార్డులో వారు కోర్టుకు వెళ్లారన్నారు. పట్టా చేసుకున్న వారిని పిలిపించి పూర్తిస్థాయిలో రికార్డులు పరిశీలిస్తామని, వెంకటేశ్వరమ్మ వ్యవసాయ భూమి రికార్డులు పరిశీలించి కలెక్టర్కు నివేదించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.