
కొల్లాపూర్, సెప్టెంబర్ 5: గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం గ్రామ కమిటీలే కీలకమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెంట్లవెల్లి, చిన్నంబావి, వీపనగండ్ల, పానుగల్, కోడేరు, కొల్లాపూర్ మండలాల ముఖ్యనాయకుల సమావేశాలు వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులై పార్టీ పటిష్టత కోసం కృషిచేయాలని కోరారు. పార్టీకోసం పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని, పదవులు రాలేదని ఎవరూ నిరాశ చెందొద్దని పేర్కొన్నారు. గ్రామ కమిటీ బాధ్యతలు అప్పగించిన నాయకులు తూచాతప్పకుండా పనులు చేయాలని సూచించారు. గ్రామ కమిటీల నియామకం అనంతరం మండల కమిటీల ఏర్పాటు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి , డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, పానుగల్ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, చిన్నంబావి జెడ్పీటీసీ వెంకటరమణమ్మ, టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్‌నాయక్, రాములుయాదవ్, శ్రీధర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రామ్మూర్తినాయుడు, రాజేశ్, రఘువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదల అభివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యం
పేదప్రజల అభివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యమని అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, ఎంపీపీ అరుణ అన్నారు. మండలంలోని బల్మూర్, మైలారం, గట్టుతుమ్మెన్‌లో ఆదివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. బల్మూరు అధ్యక్షుడిగా రాములు, మైలారం అధ్యక్షుడిగా లక్ష్మయ్య, గట్టుతుమ్మెన్ అధ్యక్షుడిగా గంగయ్యతోపాటు ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ గోపాల్‌నాయక్, విండో చైర్మన్ నర్సయ్యయాదవ్, సర్పంచులు శివశంకర్, నాగరాజు, ఎంపీటీసీలు నారాయణ, నాయకులు చుక్కారెడ్డి, నాగయ్య, రాజేందర్‌గౌడ్, సురేందర్, బండపల్లి వెంకటయ్య, చంద్రమోహన్, సుదర్శన్‌రావు, రఫీ, తిరుతపయ్య, రమేశ్ పాల్గొన్నారు.
మర్రిపల్లిలో కమిటీ ఏర్పాటు
మండలంలోని మర్రిపల్లిలో ఆదివారం టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. సింగిల్‌విండో చైర్మన్ భూపాల్‌రావు, అచ్చంపేట పాలశీతలీకరణ చైర్మన్ గోపాల్‌రెడ్డి మండల ఇన్చార్జి, అచ్చంపేట కౌన్సిలర్ రమేశ్‌రావు ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షుడిగా రవికుమార్, యూత్ కమిటీ అధ్యక్షుడిగా ఆంజనేయులు, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా నిరంజన్, బీసీసెల్ అధ్యక్షుడిగా తిరుపతయ్య, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా రామచంద్రమ్మను ఎన్నుకున్నారు.
దత్తారం కమిటీ ఏకగ్రీవం
మండలంలోని దత్తారంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీని సర్పంచ్ గుమ్మకొండ జంగమ్మ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామకమిటీ అధ్యక్షుడిగా సురేశ్‌గౌడ్, ఉపాధ్యక్షుడిగా బుడ్డయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీను, కోశాధికారిగా మల్లయ్య, ప్రచార కార్యదర్శి తిరుపతయ్య, కార్యవర్గ సభ్యులుగా కోటయ్య, ఉస్సేన్, వెంకట్‌రెడ్డి, పర్వతాలు, మల్లయ్య, కర్ణయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాయిలు, సుధాకర్ పాల్గొన్నారు.
ముమ్మరంగా టీఆర్ఎస్ గ్రామకమిటీలు
టీఆర్ఎస్ గ్రామకమిటీల ఎన్నికలు మండలంలో అన్ని గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మండలంలోని ఏల్మపల్లి, తెలుగుపల్లి, కొత్తపల్లి, తిర్మలాపూర్‌లో ఆదివారం పార్టీ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. తెలుగుపల్లి అధ్యక్షుడిగా వెంకటయ్య, ఉపాధ్యక్షుడిగా చిన్న, ప్రధానకార్యదర్శిగా తిరుపతయ్య, యూత్ కమిటీ అధ్యక్షుడిగా శివకృష్ణ, ఎల్మపల్లి అధ్యక్షుడిగా వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, కొత్తపల్లి అధ్యక్షుడు తిరుపతినాయక్, ప్రధానకార్యదర్శి బాల్‌చంద్రయ్య, లక్ష్మాపూర్ అధ్యక్షుడిగా హుస్సేన్, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులుతోపాటు ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జిల్లా నాయకులు చెన్నకేశవులు, వెంకటేశ్, షమీఉల్లా, వెంకటయ్య రామకృష్ణ, గ్రామపెద్దలు పాల్గొన్నారు.