
ఆత్మకూరు, ఆగస్టు 10 : జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది. లక్షలోపు క్యూసెక్కులతో స్థి రంగా వస్తుండడంతో మంగళవారం ఉ దయానికి 93 వేల క్యూసెక్కులుగా న మోదైంది. దీంతో 14 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. సాయం త్రం వరకు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో గేట్లను కుదించారు. 6 గంటల వరకు కేవలం 81,500 ఇన్‌ఫ్లో నమో దు కాగా 6 గేట్లు మాత్రమే తెరిచి 24,354 క్యూసెక్కులు వదులుతున్నా రు. విద్యుదుత్పత్తికి 35,844 క్యూసెక్కు లు వినియోగిస్తుండగా.. కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు 630 క్యూసెక్కులు, ఎడవ కాలువకు 1140 క్యూసెక్కులు, కుడి కా లువకు 672 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 1150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాలలో మొత్తంగా 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. ఎగువ జూరాలలో 5 యూనిట్ల లో ఒక్కరోజే 3.689 మిలియన్ యూ నిట్లు ఉత్పత్తి చేయగా.. మొత్తంగా 82.005 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాలలోనూ 5 యూనిట్లలో 3.66 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగగా.. మొత్తంగా 86.865 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. అవుట్‌ఫ్లో 63,902 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి సా మర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా ప్ర స్తుతం 8.531 టీఎంసీలు ఉన్నాయి.
టీబీ డ్యాంకు..
అయిజ, ఆగస్టు 10 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. మంగళవారం ఇన్‌ఫ్లో 50,410, అవుట్‌ఫ్లో 79,616 క్యూసెక్కులుగా న మోదైంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 100.855 టీఎంసీలు ఉండగా.. నీటిమట్టం 96.528 టీఎంసీలు నిల్వ ఉన్నా యి. పూర్తిస్థాయి నీటినిల్వ 1633 అడుగులకుగానూ 1631.87 అడుగులకు చేరినట్లు అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్కు పెరుగుదల..
కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పెరుగుతున్నది. 74,470 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా 74 వేల క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువకు ప్రవహించిందని ఏఈ శ్రీనివా స్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 12 అడుగుల మేర నీటిమట్టం ఉండగా.. ప్రధాన కాల్వకు 470 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీశైలంలో..
శ్రీశైలం, ఆగస్టు 10 : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం ఒక గేటు తెరవగా, మధ్యాహ్నం రెండు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు రి జర్వాయర్‌లో 1,42,224 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
రెండు గేట్ల నుంచి 55,966, విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి 65 వేల క్యూసెక్కులు సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. ఏపీ పవర్‌హౌస్‌లో 15.273 మి.యూ, టీఎస్ పవర్‌హౌస్‌లో 16.680 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులు ఉన్నది.