వెల్దండ, ఆగస్టు 6 : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అడుగుజాడల్లో నడుద్దామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు. మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ప్ర జాప్రతినిధులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజితారెడ్డి, ఎంపీపీ విజయ, సర్పంచ్ భూపతిరెడ్డి, అధికారులు ఉన్నారు.
జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
నాగర్‌కర్నూల్, ఆగస్టు 6: జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ శర్మన్, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్‌గౌడ్ అన్నారు. కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ఆధ్వర్యంలో శుక్రవారం జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలోనూ జయశంకర్ జయంతి నిర్వహించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికారులు అనిల్‌ప్రకాశ్, సీతారాం, నర్సింగరావు, రామ్‌లాల్, రాజేశ్వరి, ఎర్రిస్వామి, కలెక్టరేట్ సిబ్బంది, మున్సిపల్ వైస్‌చైర్మన్ బాబురావు, కమిషనర్ అన్వేష్, మేనేజర్ యాదయ్య, కౌన్సిలర్ సునేంద్ర, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, నెలపొడుపు సాహిత్య వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సార్ ఆశయాలను కొనసాగించాలి
తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హన్మంత్‌రావు పేర్కొన్నారు. మండలకేంద్రంలో శుక్రవారం జయశంకర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సార్ సూచించిన అంశాలనే ప్రభుత్వం అనుసరిస్తున్నదని తెలిపారు. అదేవిధంగా సీఎల్ఆర్ విద్యా సంస్థల్లో జయశంకర్ జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. కార్యక్రమాల్లో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, ఎంపీటీసీ రమేశ్, ఉపసర్పంచ్ కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు రాములు, సత్యనారాయణ, నర్సింహ, చక్రవర్తి, శ్రీనివాసులు, భరత్ ఉన్నారు.
కల్వకుర్తి మండలంలో..
కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు పావని ఆధ్వర్యంలో, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి కన్వీనర్ రాజేందర్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో జాగృతి విద్యార్ధి విభాగం జిల్లా కన్వీనర్ గణేశ్, విజయలక్ష్మి, సుజాత, రాము, రాహుల్, బీసీ సబ్‌ప్లాన్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు ఉన్నారు.
బిజినేపల్లి మండలంలో..
మండలకేంద్రంలోని ఎంపీడీవో, తాసిల్దార్ కార్యాలయాలు, పాలెం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో, ఆయా గ్రామాల్లో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్ వో సుధాకర్లాల్, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ హరిచరణ్‌రెడ్డి, రాజారాంప్రకాశ్, శ్రీధర్, తాసిల్దార్ అంజిరెడ్డి, ఎం పీడీవో రామ్మోహన్, అవంతి, బసవలింగం, నాగమణి, రా జు, అల్లోజీ, భారతి, వెంకటయ్య, భూషయ్య ఉన్నారు.
తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో, ఎంపీపీ, టీఆర్ఎస్ కార్యాలయాల్లో జయశంకర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు స్వామి, ప్రధాన కార్యదర్శి రఘుమారెడ్డి, సర్పంచ్ వేణుగోపాల్‌గౌడ్, కోఆప్షన్ సభ్యుడు రజాక్, ఎంపీటీసీ లీలావతి, ఇబ్రహీం, సైఫొద్దీన్, రమాకాంత్, సలావుద్దీన్, నాగరాజుగౌడ్, శ్రీశైలం, నర్సింహ, నవీన్, శ్యామ్, బాలు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక
కల్వకుర్తి, ఆగస్టు 6 : తెలంగాణ అస్థిత్వానికి ఆచార్య జయశంకర్ ప్రతీక అని మున్సిపల్ చైర్మన్ సత్యం పేర్కొన్నారు. శుక్రవారం కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి చైర్మన్ పూలమాల వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షుడు విజయగౌడ్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ సురేందర్‌రెడ్డి, సుభాష్‌నగర్‌లో తెలంగాణ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీచైర్మన్ శ్రీశైలం, వైస్‌చైర్మన్ షాహెద్, కౌన్సిలర్లు బాలు, సూర్యప్రకాశ్, యాదమ్మ, శ్రీనివాస్, ఎజాస్, సైదులు, బోజిరెడ్డి, మనోహర్‌రెడ్డి, కమిషనర్ జాకీర్అహ్మద్, టీపీవో విజయ్‌కుమార్, మున్సిపల్ సిబ్బంది, అధ్యాపకులు సదానందరం, మల్లేశ్, శ్రీనివాస్, సత్యం, పరశురాం, శాంతికుమార్, బాలయ్య, తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ గణేశ్, షకీల్, అరుణ్ తేజా, సందీప్, శరత్, పృథ్వీ, రాము, శివ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో..
కందనూలు, ఆగస్టు 6 : జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటం వద్ద ని వాళులర్పించారు. డీఈవో కార్యాలయ ఆవరణలో జయశంకర్ చిత్రపటానికి డీఈవో పూలమాల వేసి నివాళులర్పించా రు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ శ్రీశైలం, జెడ్పీసీఈవో ఉష, డి ప్యూటీ సీఈవో భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ మంగి విజయ్, గణాంకాధికారి ఈశ్వరప్ప, ఏసీ రాజశేఖర్‌రావు, డీఎస్వో కృష్ణారెడ్డి, సీఎంవో వెంకటయ్య, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వరశెట్టి, విశ్వనాథ్, కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జయశంకర్ సార్‌కు ఘన నివాళి
మండలంలోని ఎంపీడీవో ఎంపీడీవో జయసుధ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏపీఎం రాములు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలకు వాటర్ ట్యాంక్ అందజేత
మండలంలోని మేడిపూర్ ఎంపీపీఎస్‌లో జయశంకర్ జయంతి సందర్భంగా పాఠశాలకు క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంకును అందజేశారు. కార్యక్రమంలో సీహెచ్‌వో అహ్మద్ అలీ, ఎస్ఈవో ఎన్డీవీ చారి, సీనియర్ అసిస్టెంట్ తిరుపతయ్య, ఎంపీహెచ్ఈఏలు శ్రీనివాసులు, దాసు, ఫార్మాసిస్టు అనిత, ఎన్టీ కొండలయ్య, ఏఎన్ఎంలు లక్ష్మీకుమారి, షరా, ప్రవీణ, హైమావతి, అనురాధ, రమణ, రాఘవేందర్, జ్యోతి, ప్రేమ్‌కుమార్, శ్రీకాంత్, బుచ్చిరావు, సాయిప్రభ, జ్యోతి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
వంగూరు మండలంలో..
మండలకేంద్రంలో తాసిల్దార్ రాజునాయక్ ఆధ్వర్యంలో, ఎంపీడీవో లక్ష్మణ్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో జిల్లా కోఆప్షన్ సభ్యుడు హమీద్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లాలూయాదవ్, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు జంగయ్య, సర్పంచులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రాజరంగారావు, ఎల్లాగౌడ్, జానీపాషా, డీటీ రవూఫ్, ఆర్ఐ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.