మక్తల్ రూరల్, సెప్టెంబర్ 30 : ప్ర భుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పె ద్దపీట వేసిందని, ఇందులో భాగంగా ఉచితంగా అందజేస్తున్న చేప పిల్లలను పెంచి పెద్దయ్యాక విక్రయించి ఆర్థికం గా అభ్యున్నతి సాధించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్లో 7 లక్షల 80 వేల చేప పిల్లలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమం త్రి కేసీఆర్ మత్స్య పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక ని ధులు కేటాయించారని తెలిపారు. చేపలు పట్టే కార్మికులకు సబ్సిడీ రుణాలు, వలలు, సామగ్రి అందజేస్తున్నామని చెప్పారు. గతంలో కార్మికులు సొంత డబ్బులు వెచ్చించి చేప పిల్లలు కొనుగోలు చేసే వారని గుర్తు చేశారు. నేడు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో మత్స్య సంపద పెరిగిందన్నారు. మూడేండ్లలో సంగంబండ పెద్దవాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి, భూత్పూర్ రిజర్వాయర్లలో ప్రభు త్వం అందించిన 10 లక్షల చేపల పిల్లలను విడుదల చేశామన్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు రావడం వల్ల రెండు రిజర్వాయర్లు పూర్తిగా నిండాయని, దీంతో 20 ల క్షల చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దళారులను ఆశ్రయించకుండా కార్మికులు సొంతంగా చేపలను మార్కెట్కు తరలించి విక్రయించాలని సూచించారు. మ త్స్యకారులకు సహాయ, సహకారాలు అందిస్తానని ఆ య న హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాలమ్బిన్ ఉమర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు శంషొద్దీన్, భూత్పూ ర్ సర్పంచ్ హన్మంతు, మత్స్య సంఘం గ్రామ కమిటీ అధ్యక్షుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.